వర్డ్ ఫైల్ ని పీడిఎఫ్ ఫైల్ కింద ఇలా సింపుల్ గా కన్వర్ట్ చేయండి..!

-

నేటి కాలం లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసాయి. ఎవరికి నచ్చిన ఫార్మెట్ లో వాళ్ళు వచ్చేసి ఆ తర్వాత మళ్లీ కన్వర్ట్ చేసుకోవచ్చు. పైగా నేటి కాలం లో పిడిఎఫ్ ఫైల్స్ షేర్ చేయడం మామూలైపోయింది. అయితే పీడిఎఫ్ ఫైల్ లో మంచి విషయం ఏమిటంటే వర్డ్స్ మారవు. ఇదిలా ఉంటే డిజైన్ మరియు రంగులు కూడా మార్పు చేసుకోవడానికి అవ్వదు. పైగా ఇవి సులువుగా ఓపెన్ చేసుకోవచ్చు.

మొబైల్ లో మరియు డెస్క్ టాప్ లో కూడా దీన్ని సులువుగా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు పిడిఎఫ్ ఫైల్ ని ఎలా మార్చుకోవచ్చు అనేది చూద్దాం…!

పీడీఎఫ్ ఫైల్ కి డిమాండ్ ఎక్కువ ఎందుకు..?

పీడీఎఫ్ ఫైల్స్ కి డిమాండ్ ఎందుకు ఎక్కువ అంటే అది ఒరిజినల్ డాక్యుమెంట్ ని అలాగే ఉంచుతుంది. పైగా ఫాంట్ లో కూడా ఎటువంటి మార్పు ఉండదు.

వివిధ భాషల్లో ఉపయోగించ వచ్చా..?

మీకు నచ్చిన భాషలో మీరు పిడిఎఫ్ ని తయారు చేసుకోవచ్చు ఉదాహరణకి హిందీ లేదా తమిళ్ ఇలా ఏదైనా సరే మీరు పిడిఎఫ్ చేసుకోవచ్చు. సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిడిఎఫ్ ని ఏ ఫార్మెట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవడం సులభం.

వర్డ్ ని పీడిఎఫ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి..?

ఈ విషయానికి వస్తే ఏవైనా పీడీఎఫ్ ఫైల్ కింద ఆన్ లైన్ లో సులువుగా మార్చుకోవచ్చు. దీని కోసం ముందుగా మీరు వర్డ్ టు పీడిఎఫ్ ఫైల్ కన్వర్టర్ ని సెర్చ్ చెయ్యండి.

మీరు ఆన్లైన్లో ఏదైనా కన్వర్టర్ ని చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు వర్డ్ ఫైల్ ని అక్కడ అప్లోడ్ చేయండి. ఇప్పుడు అక్కడ పిడిఎఫ్ ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి. ఇలా సులువుగా మీరు వర్డ్ ఫైల్ ని పీడిఎఫ్ కింద మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news