కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నారా…? అయితే త్వరపడండి. త్వరలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మార్చ్ 31 లోపు కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదా తర్వాత భారీగా ధరలు పెరుగుతాయని అంటున్నారు. 39వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశంలో మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. సాంసంగ్, ఒప్పో, వివో ,రెడ్ మై లాంటి,కంపెనీలు మన మార్కెట్ పై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి.
పోటీ ఎక్కువగా ఉండటంతో అవి తక్కువ ధరకు తమ స్మార్ట్ ఫోన్ ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. కాని ఇప్పుడు కేంద్ర౦ జీఎస్టి ని పెంచడంతో ఆ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. వాటి ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి లాభాలను తగ్గించుకొని జీఎస్‌టీ సర్దుబాటు చేయడం… ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు.
దీనితో మరో మార్గంగా ధరల్ని పెంచి ఆ భారాన్ని కొనుగోలు చేసే వారిపై వేయడం. స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీ పెంచడంపై షావోమీ ఇండియా ఎండీ మను జైన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కనీసం రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లను అయినా జీఎస్‌టీ కౌన్సిల్ మినహాయించాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన విజ్ఞప్తి చేసారు. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు.