జూలై 31 నుంచి ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు బంద్..!

Join Our Community
follow manalokam on social media

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఎల్‌జీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన కంపెనీ స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయనుంది. మొబైల్ విభాగంలో తీవ్రంగా నష్టపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహన భాగాలు, పరికరాలు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ టు బిజినెస్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఎల్‌జీ స్మార్ట్ ‌ఫోన్లలో ఇప్పటికే వింగ్ వెల్వెట్, క్యూ సిరీస్, డబ్ల్యూ సిరీస్, కే సిరీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మోడళ్లకు సంబంధించిన అమ్మకాలు ఇప్పట్లో ఆగిపోవు.

ఎల్‌జీ స్మార్ట్ ఫోన్లు

జూలై 31వ తేదీ నుంచి ఎల్‌జీ సంస్థ తన వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయనుంది. అప్పటివరకు ప్రస్తుతం మిగిలిన ఉన్న స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తులను కొనసాగుతుంది. అయితే చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత సర్వీస్ రిపేరింగ్, సాఫ్ట్‌ఫోన్ అప్‌డేట్ ఎలా జరుగుతాయనే ప్రశ్న మదిలో మెదలవచ్చు. ఈ విషయంపై వినియోగదారులకు సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దంటూ భరోసా కల్పించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తులు మూతబడేంత వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కొనసాగుతోందని తెలిపింది. అలాగే స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నిలిపివేసేంతవరకు వ్యాపార భాగస్వాములు, కంపెనీ సరఫరాదారులతో కలిసి పనిచేస్తుందన్నారు. అయితే ఎల్‌జీ కంపెనీ తాజా నిర్ణయంతో స్మార్ట్ ఫోన్ల తయారీలో పనిచేసే ఉద్యోగులను పదవి నుంచి తొలగించే ప్రమాదం ఉండగా… మరికొందరిని కంపెనీ ఇతర విభాగాల్లో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొదటగా మార్కెట్‌లోకి ఎల్‌జీ కంపెనీ అడుగు పెట్టినప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అనేక రకాల సెల్‌ఫోన్లతో దూసుకొచ్చింది. 2013లో ఆపిల్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థల తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా నిలిచింది. రానురాను కంపెనీల మధ్య పోటీ పెరగడం, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడటం, ఐడేళ్లలో దాదాపు 4.5 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసింది. అందుకే ఎల్‌జీ కంపెనీ సీఈఓ ఈ స్మార్ట్‌ఫోన్ల తయారీని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...