పవన్ కెరీయర్ కి కీలకంగా మారిన వకీల్ సాబ్

Join Our Community
follow manalokam on social media

పవర్ స్టార్ వకీల్ సాబ్ గా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అజ్ణాతవాసి తర్వాత 3ఏళ్ళు టైమ్ తీసుకుని ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు. కాకపోతే ఈసారి ఇచ్చే ఎంట్రీ.. ఎన్నో లెక్కలతో కూడుకున్కదని పరిశ్రమ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్లోను వినిపిస్తుంది.

రానున్న రోజులలో పవన్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి.తన పరిధిని మరింత పెంచుకునే క్రమంలో తన ప్రొఫైల్ ను తీర్చిదిద్దుకుంటున్నాడు.ఈప్రాసెస్ లో పలువురు బడా దర్శకులు పవన్ డేట్స్ తీసుకునే పనిలో పడ్డారు. కాకపోతే పొలిటికల్ షెడ్యూల్ లో భాగంగా కమిటైన వాటికే కాల్షీట్స్ ఇచ్చుకుంటూ పోతున్నాడు.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను మన ముందుకు తెస్తూనే..క్రిష్ డైరెక్షన్లో హరిహరవీరమల్లు లాంటి పీరియాడిక్ ఫిలింతో పాన్ ఇండియా కలరింగ్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఈ ప్రాజెక్ట్ కు బడ్జెట్ వందకోట్లకు పైగా ఉంది.చిత్రం పూర్తి అయ్యేసరికి అది 130నుంచి 150కోట్లు వరకు అవుతుందంటున్నారు.ఇప్పటివరకు పవన్ చేసినా ఏ ఫిలిం ఇంతటి బడ్జెట్ ను వసూల్లు చేయలేదు.నిర్మాత ఎ.ఎం.రత్నం ఇంతలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే..పవన్ పొటెన్షియాలిటీ మీద గురి లేకుండా అయితే చేయడు కదా.

వకీల్ సాబ్ తో వస్తున్న పవన్ కు రానున్న రోజులు ఎంతో కీలకం కానున్నాయి.ఈ ఫిలిం ఇచ్చే రిజల్ట్‌ తో పాటు చేసే ప్రతి సినిమా తన ఫ్యూచర్ ను డిసైడ్ చేయనుంది.ఈ ప్రాసెస్ లో ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా అది తర్వాత పొలిటికల్ నిర్ణయాలపై పడుతుంది.మరి వీటిని ట్రబుల్ షూట్ చేయడంలో పవన్ ఎలాంటి స్టెప్ వేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.పాలిటిక్స్ లోకి రావడంతో పూర్తి టైమ్ ను సినిమాలకు కేటాయించలేకపోతున్నాడు.గత మూడేళ్లుగా ఆ ప్రాబ్లమ్ తోనే సినిమాలు చేయకుండా ఉన్నాడు.

జనసేనాని చేతిలో ఇంకో మూడు నాలుగు సినిమాలున్నాయి.అవన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రాసెస్ లో ఉన్నాడు.ప్రజాజీవితంలో మళ్లీ బిజీ అవ్వాలనే ఆలోచనతోటే ఇలా చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి చేసి మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో మరింత ముందుకు వెల్లాలని చూస్తున్నాడట. రానున్న రోజుల్లో తన పార్టీ రన్ చేయడానికి కావల్సిన ఫండ్స్ ను సమకూర్చుకోవాలి కాబట్టి ఆ లోటును సినిమాలు చేయడం ద్వారా తీర్చుకుంటున్నట్లు చెబుతున్నారు పవన్.

వకీల్ సాబ్ జస్ట్ సినిమాగా మాత్రమే కాకుండా లేడీ ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేసే పిక్చర్ గా నిలవబోతుంది.అందుకు తగ్గట్లుగానే సినిమా అవుట్ పుట్ వచ్చిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గత సినిమాల్లో మాదిరిగా ఎలాంటి చిందులకు ఛాన్స్ లేకుండా ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింగా వకీల్ సాబ్ నిలవబోతుంది.ఈ ఒక్క సినిమా పవన్ చేసే మిగతా నాలుగు సినిమాల ఫలితాలను డిసైడ్ చేయనుంది.

TOP STORIES

శ్రీరామనవమి అంటే రాముని పుట్టిన రోజా? పెళ్ళి రోజా ?

శ్రీరామ నవమి అంటే చాలు అందరికీ పండుగే. ఆ సుగణభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. మరి నిజంగా ఆరోజే...