తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభావం పై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ బలంగా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల కారణంగా ప్రజలలో ఆగ్రహం పెరుగుతోంది. దీంతో బిజెపి పెద్దల కంటే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సమర్ధవంతంగా వాడుకోవడం మంచిది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్ ని సినిమాలు మానేసి వచ్చి ప్రచారం చేయాలని కోరుతున్నారు. బిజెపి కార్యకర్తలు కూడా ఆ పార్టీ అగ్రనేతలు కంటే కూడా పవన్ కళ్యాణ్ వస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా చిరంజీవిని కూడా ప్రచారానికి తీసుకు రావాలని కోరుతున్నారు. అయితే చిరంజీవి ఎంతవరకు ప్రచారం చేస్తారు అనేది స్పష్టత లేదు.
ఇక జనసేన పార్టీలో ఉన్న కాపు సామాజికవర్గం నేతలు అందరిని కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో సమర్థవంతంగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా మారుతాయి అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తిరుపతిలో గట్టిగానే ఫోకస్ చేసి ప్రచారం చేస్తున్నారు.