గత కొన్నాళ్ళు గా మహిళలపై దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మహిళల భద్రత కోసం ఇప్పుడు టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వారణాసికి చెందిన ఒక యువకుడు లిప్‌స్టిక్ గన్ను పేరుతో ఒక పరికరాన్ని తీసుకొచ్చాడు. ఆపద సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్ళకు ఆ గన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులోని బటన్‌ను ప్రెస్ చేయగానే పెద్దగా శబ్దం వచ్చి, చుట్టూ ఉన్న వారిని అలెర్ట్ చేస్తుంది. అంతే కాదు అండి, పోలీసులకు ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా ఈ పరికరాన్ని తయారు చేసాడు. దీని తయారీకి కేవలం 600 రూపాయలు మాత్రమే ఖర్చైందని, తాను త్వరలో పేటెంట్ కూడా దరఖాస్తు చేస్తా అని చెప్పాడు. చూడటానికి లిప్ స్టిక్ లా ఉండి ఎవరికి,
అనుమానం రాకుండా ఉంటుందని అంటున్నారు. మొబైల్ ఫోన్ కి బ్లూ టూత్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకోవచ్చు. ఆపద సమయంలో చుట్టుపక్కల వారితో పాటూ మనకు సమీపంలో ఉన్న పోలీసులను ఒకే కాలంలో అలెర్ట్ చేయవచ్చని చెప్పాడు. లిప్‌స్టిక్‌కు చిన్న సాకెట్‌ను చేసి దీనిని తయారు చేసాడు అతడు. దీనిపై పలువురు అతన్ని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.