ఈ రైలుకు ఇంధనం అక్కర్లేదు.. దానంతట అదే నడుస్తుందట..! 

-

సాధరణంగా ఏ వాహనాన్ని నడపడానికి అయినా.. డ్రైవర్ కావాలి.. పెట్రోల్ లేదా డీజిల్ నింపాలి. టెక్నాలజీ పెరిగే కొద్ది.. ఇంధనంతో పనిలేని ఎలక్ట్రిక్ కార్లు, బైకులు వచ్చేశాయి. ఛార్జింగ్ పెడితే రయ్ మని వెళ్లిపోవడమే.. ఇప్పుడు ఇంధనం అవసరం లేని ట్రైన్ వచ్చేసింది.
అయితే ఇక్కడ హైలెట్ ఏంటంటే.. ఎలక్ట్రిక్ కార్లకు, బైకులకు అయితే.. మనం చార్జింగ్ పెట్టాలి.. కానీ ఈ ట్రైన్ దానికదే ఛార్జింగ్ పెట్టుకుని పోతుంది. చెప్తుంటేనే భలే ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ.. ఇంకా ఈ క్రేజీ ట్రైన్ విశేషాలేంటంటే..
ఈ రైలు ఆస్ట్రేలియాలోని ఓ మైనింగ్ కంపెనీ తయారు చేస్తోంది. ఇంధనం లేకుండా నడిచే ఈ రైలును ఇన్ఫినిటీ రైలు అని పిలుస్తారట. ఈ రైలు వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంట్రా అంటే.. కాలుష్య స్థాయి తగ్గించడం. అంతేకాకుండా రైలులో ఇంధనం నింపే ఇబ్బంది కూడా ఉండదు. ఇనుప ఖనిజాలని తక్కువ సమయంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రాన్స్ పోర్ట్ చేయొచ్చు.
మైనింగ్ కంపెనీ ఫోర్టెస్క్యూ ఈ సాంకేతికతపై పని చేస్తుంది. ఈ రైలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లేటప్పుడు స్వయంగా.. అదే ఛార్జ్ అవుతుంది. దాని శక్తి ఎప్పటికీ అయిపోదు. 244 బోగీలుండే ఈ రైలులో 34,404 టన్నుల ఇనుప ఖనిజం నింపుతారట. అప్పుడు రైలు మరింత బరువుగా మారుతుంది. ఈ రైలు ఖాళీగా వచ్చేటప్పుడు స్వయంచాలకంగా గురుత్వాకర్షణ శక్తితో ఛార్జ్ అవుతుంది.
ఈ రైలు ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తివంతమైన, సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ రైలుగా నిలుస్తుందని ఫోర్టెస్క్యూ సీఈఓ ఎలిజబెత్ గెయిన్స్ తెలిపారు. ఈ రైలు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాడకం తగ్గిపోతుందని, కాలుష్యం సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.. ఇప్పుడు చాలా కార్లలో బ్రేక్‌ వేసినప్పుడు వాటికవే రిఛార్జ్‌ అయ్యే సాంకేతికతని వాడుతున్నారు. ఇప్పుడు ఇదే సాంకేతికతని ఇన్ఫినిటీ రైలులో ఉపయోగిస్తున్నారు. కేవలం గురుత్వాకర్షణ శక్తితో నడవగలిగే ఈ ట్రైన్ నిజంగా ప్రత్యేకమే. ఇవి ఇంకా డవలప్ అయితే.. కాలుష్యంతో పాటు.. బొగ్గు, డీజిల్ వాడకం కూడా తగ్గించవచ్చు. రైళ్లు నడిపేందుకు బొగ్గు, డీజిలపై ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చుపెడుతుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news