రెండు కొత్త స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన రీయల్ మీ..!

మీరు ఏదైనా మంచి స్మార్ట్ టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీలను (Realme Smart TV X Full HD) విడుదల చేయనున్నట్లు రీయల్ మీ ప్రకటించడం జరిగింది. అయితే ఈ రెండు స్మార్ట్ టీవీ లు కూడా అదిరే ఫీచర్స్ తో రానున్నాయి. ఈ స్మార్ట్ టీవీలను రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాలకు విడుదల చేస్తున్నట్లు రియల్ మీ చెప్పింది. అయితే మరి ఈ రెండు స్మార్ట్ టీవీల కి సంబంధించి బయట పడ్డ విషయాలను మనం ఇప్పుడు చూద్దాం.

 

పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా FHD రిజల్యూషన్ ని కలిగి వుండనున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీల లో ఒకటి 40 ఇంచ్ సైజు తో మరొకటి 43 ఇంచ్ సైజుతో తీసుకు వస్తునట్లు కూడా రీయల్ మీ కంపెనీ చెప్పింది.

రియల్ సినీమ్యాటిక్ అనుభవాన్ని అందించే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ ను కూడా అందించినట్టే తెలుస్తోంది. ఈ స్మార్ట్ టీవీలు ని ARM కోర్టెక్స్ A55 CPU మరియు Mali-G31 GPU క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో కనెక్ట్ చేసారు. అదే విధంగా ఈ రెండు టీవీలు కూడా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ ని కలిగి ఉంటాయి.

ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ X ఫుల్ HD టీవీలు HDR 10 మరియు HLG రెండు ఫార్మాట్ లకు కూడా సపోర్ట్ ని ఇస్తాయి. HDR 10 సపోర్ట్, ప్రీమియం బెజెల్ లెస్ డిజైన్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ ఫీచర్స్ ని కలిగి వున్నాయి.