కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. దాదాపు అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. వేలాది మంది ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా దాదాపుగా ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితికి వెళ్ళిపోయాయి. ఇక అన్ని దేశాలు కూడా ఇప్పుడు ప్రజలను ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరుతున్నాయి.
ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. వాట్సాప్ వీడియో కాలింగ్, ఐఫోన్ లో పేస్ టైం, మెసెంజర్ వీడియో కాల్, గూగుల్ సంబంధిత యాప్స్ అన్నీ కూడా వాట్సాప్ సర్వీసులను అందిస్తున్నాయి. కాబట్టి వీటిని వాడుకోవాలని సూచిస్తున్నారు. బంధువులకు అందరికి వీడియో కాల్స్ చేసుకోమని సూచిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా మంచి టైం పాస్ అవుతుంది అనే విషయం అందరికి తెలుసు. కాబట్టి సోషల్ మీడియాలో మంచి పోస్ట్ లు పెట్టడమే కాకుండా మంచి పోల్స్ పెట్టడం మీకు సన్నిహితంగా ఉండే మిత్రులతో కొన్ని కొన్ని కార్యక్రమాలు సోషల్ మీడియాలో చేయడం వంటివి సోషల్ మీడియాలో చేస్తే పెద్దగా బోర్ కొట్టే అవకాశం లేదని, ఇక మీ ఇంట్లో మీరు ఎం చేస్తున్నారో షేర్ చేసుకోవాలని,
తద్వారా ఆసక్తికరంగా మారుతుందని పలువురు సూచిస్తున్నారు. లైవ్ వీడియో లు పెట్టడమే కాకుండా పాటలు పాడటం, పిల్లలతో సందడి చేసేవి, ఇలా ఎన్నో చేయవచ్చని, అలాగే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చాలా హుషారుగా ఉంటాయని వాటిని సరదా సరదాగా చేసుకోవచ్చు అని సూచిస్తున్నారు. వర్క్ ఫ్ర౦ హోం కి కూడా సోషల్ మీడియా వాడుకుంటే చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు.