టిక్ టాక్ డిలీట్ చేస్తున్న యూజర్లు…!

-

కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మన దేశంలో ఇప్పుడు చైనా తయారు చేసిన టిక్ టాక్ ని బాన్ చెయ్యాలి అనే డిమాండ్లు ఎక్కువగా వినపడుతున్నాయి. టిక్ టాక్ బాన్ చెయ్యాల్సిందే అని పలువురు తమ ఫోన్ నుంచి ఆ యాప్ ని కూడా డిలీట్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ యాప్ ని ఎవరూ వాడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇది పక్కన పెడితే టిక్ టాక్ మాత్రం మనకు వంద కోట్ల సాయం చేసింది. భారత్‌లో కరోనా బాధితులకు నిద్రాహారాలు మాని పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి, కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని… టిక్ టాక్ యాజమాన్యం పేర్కొంది. అందుకే తాము డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు సాయం చేస్తున్నట్లు తెలిపింది. రూ.100 కోట్ల విలువైన 400000 మెడికల్ ప్రొటెక్టివ్ సూట్లు, 200000 మాస్కులను భారత్‌లోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు అందించింది.

అయినా సరే టిక్ టాక్ ని బాన్ చెయ్యాలని డిమాండ్ లు ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు దాన్ని మన భారత్ లో ఉంచవద్దు అని పలువురు కోరుతున్నారు. బ్యాన్ టిక్ టాక్ పేరుతో ఓ ట్రెండ్ కూడా నడుస్తోంది. చాలా మంది కరోనా వైరస్‌ను ప్రోత్సహిస్తూ… టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతున్నారనీ… అందువల్ల టిక్‌టాక్‌ను నిషేధించాలి అని కోరే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని చాలా మంది డిలీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news