5జి ఫోన్ వాడుతున్నారా ? బ్యాట‌రీని ఆదా చేయాలంటే 5జి ని ఆఫ్ చేయండి..!

-

ప్ర‌పంచంలో ఇప్ప‌టికీ చాలా మంది 4జి సేవ‌ల‌నే ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం కొన్ని చోట్ల మాత్రమే 5జి అందుబాటులో ఉంది. ఇక భార‌త్‌లో త్వ‌ర‌లో 5జి సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే 5జి సేవ‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోయినా కంపెనీలు మాత్రం 5జి ఫోన్ల‌ను త‌యారు చేసి వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో 5జి ఫోన్ల‌కు గిరాకీ ఏర్ప‌డింది. ఆ ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఆసక్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

using 5g smart phone switch off 5g to save battery

అయితే 5జి ఇప్ప‌టికీ మ‌న‌కు అందుబాటులోకి రాలేదు, కానీ 5జి ఉన్న చోట్ల ఆ నెట్‌వ‌ర్క్‌ను వాడితే స్మార్ట్ ఫోన్ల‌లో బ్యాట‌రీ ప‌వ‌ర్‌ అధిక వేగంతో ఖ‌ర్చ‌వుతుంద‌ని నిర్దారించారు. బ్యాట‌రీ వేగంగా అయిపోతుంద‌ని తేల్చారు. అయితే 5జి అవ‌స‌రం లేక‌పోతే ఫోన్‌లో నెట్‌వ‌ర్క్ సెట్టింగ్స్ లో 5జి ని ఆఫ్ చేసి కేవ‌లం 4జి ని మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని ప్ర‌ముఖ అమెరిక‌న్ టెలికాం కంపెనీ వెరిజాన్ వెల్ల‌డించింది. 5జి వ‌ద్ద‌నుకునే వారు దాన్ని ఆఫ్ చేయ‌వ‌చ్చ‌ని, దాంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ పెరుగుతుంద‌ని తెలిపింది.

కానీ మార్కెట్‌లో దాదాపుగా అధిక శాతం వ‌ర‌కు 4జి ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. 5జి ఫోన్ల సంఖ్య చాలా త‌క్కువ‌. కానీ 5జి ఫోన్ల‌లో బ్యాట‌రీని ఆదా చేయాల‌ని అనుకునేవారు ఎలాగూ 5జి మ‌న‌కు అందుబాటులో లేదు క‌నుక దాన్ని ఆఫ్ చేస్తే బ్యాట‌రీని సేవ్ చేయ‌వ‌చ్చు. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్‌, లైఫ్ పెరుగుతాయి. కాగా మ‌న దేశంలో రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్‌లు ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు 5జి సేవ‌ల‌ను అందించాల‌ని చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news