రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత !

-

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన సంచలనంగా మారింది. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండడంతో ఇప్పటికే చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అరగంట నుంచి విమానాశ్రయంలోనే  బాబు ఉండిపోయారు. అలాగే రేణిగుంట పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు.

అయితే బాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. చంద్రబాబు పర్యటన అనుమతించాలని కొన్నిచోట్ల టీడీపీ నేతల నిరసనలు చేయగా వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి అలాగే పులివర్తి నానిని కూడా అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.

Read more RELATED
Recommended to you

Latest news