ఫోన్‌పే లేదా గూగుల్ పే ని ఉపయోగిస్తున్నారా…? అయితే వీటిని గుర్తు పెట్టుకోండి..!

ఈ మధ్య కాలంలో డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఎక్కువ అయ్యాయి. చాలా మంది ఆన్‌లైన్ లావాదేవీలనే వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ చెల్లింపులు చేయడం ఈజీ అయ్యింది. అయితే ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసపోవాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా అనుసరించాలి.

ఆన్ లైన్ పేమెంట్స్ విషయం లోకి వస్తే జాగ్రత్తగా అనుసరించాలి. యూపీఐ అకౌంట్‌ను లేదా అడ్రస్‌ను పంచుకోవద్దు. యూపీఐ అడ్రస్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలి. అలానే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పేమెంట్ లేదా ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ యాప్‌లకు స్ట్రాంగ్ స్క్రీన్ లాక్ అవసరం.

గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లేదా మరో ఇతర పేమెంట్ ప్లాట్ ఫామ్ ని ఏదైనా వాడుతుంటే స్ట్రాంగ్ పిన్ నెంబర్ పెట్టుకోవాలి. ఎవరితో కూడా మీరు మీ పిన్‌ను పంచుకోకూడదు. ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌కి ఒకటికి మించి ఎక్కువ వాడకుండా చూసుకోవాలి. చాలా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ యూపీఐ లావాదేవీలకు అనుమతి ఇస్తున్నాయి.

అదే విధంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్‌డేట్లు బగ్‌లను ఫిక్స్ చేస్తాయి. సెక్యూరిటీ బ్రీచ్‌ల బారిన పడకుండా మీ అకౌంట్‌ను కాపాడతాయి. అలానే హ్యాకర్లు లింక్‌లను షేర్ చేసి లేదా కాల్ చేసి వెరిఫికేషన్ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని అంటున్నారు. ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చెయ్యకూడదు. బ్యాంకులు పిన్‌లు లేదా ఓటీపీలను లేదా మరే వ్యక్తిగత వివరాలను అడగవని గుర్తుంచుకోవాలి.