వైసీపీ నాయ‌కులు పిశాచ‌కులు : నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ పార్టీ, ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లంద‌రూ పిశాచ‌కులు అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. గుంటూరు జిల్లా పెద‌నందిపాడు జ‌గ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక‌ల్లో చంద్ర‌బాబును దూషిస్తోన్న‌ వైసీపీ శ్రేణులను ప్ర‌శ్నించ‌డ‌మే ద‌ళితుడైన వెంకటనారాయణ చేసిన నేరమా..? అని నిల‌దీశారు నారా లోకేష్‌.

మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి రాక్ష‌స‌ మూక‌ల మాదిరి వ్యవహరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా లోకేష్‌. త‌ప్పుని త‌ప్ప‌ని చెబితే చంపేస్తారా ? మంచి చెప్పే మ‌నుషుల ప్రాణాలే తీసేస్తారా ? అని నిల‌దీశారు నారా లోకేష్‌. ఒంగోలు లో వైశ్యుడైన సొంత పార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంక‌ట‌ నారాయ‌ణ‌.. రోజు కొక‌రు వైసీపీ పిశాచ‌ ముఠాలకి బ‌ల‌వ్వాల్సిందేనా..? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు నారా లోకేష్‌. జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ‌మే ఇవ‌న్నీ చేయిస్తోంద‌నేది సుస్ప‌ష్టం.. అడ్డుకోవాల్సిన పోలీసులేమ‌య్యారు? అని ప్ర‌శ్నించారు నారా లోకేష్‌. కాగా… గుంటూరు జిల్లా పెద‌నందిపాడు ద‌ళితుడైన వెంకటనారాయణపై వైసీపీ నేతలు దారుణంగా దాడి చేశారు.