ట్విట్టర్ లో ఇక నుంచి వాయిస్ టైప్ ట్వీట్ లు…?

-

2021 ప్రారంభంలో ఆడియో మరియు వీడియోలకు ఆటోమేటెడ్ శీర్షికలను జోడించడానికి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఫీచర్ వికలాంగులు సోషల్ మీడియా వాడటానికి మరింతగా ఉపయోగపడుతుందని ట్విట్టర్ పేర్కొంది. మైక్రో- బ్లాగింగ్ ప్లాట్‌ఫాం వికలాంగుల కోసం దాని ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ధి చేసేలా వాయిస్ ట్వీట్‌ లను గతంలో కూడా పరీక్షించింది.

twitter
twitter

రాబోయే నెలల్లో, ఇంటర్వ్యూలు, సర్వేలు మరియు కొత్త ప్రోటో టైప్‌ ల రిమోట్ వినియోగ సర్వేలు చేయడం ద్వారా ద్వారా వికలాంగుల నుండి తాము అభిప్రాయాన్ని తెలుసుకుంటాం అని ట్విట్టర్ పేర్కొంది. ఒక వాయిస్ మాత్రమే కాకుండా వీడియోలను కూడా జోడిస్తామని చెప్పింది. గత కొన్నాళ్ళుగా ట్విట్టర్ వాడకం పెరుగుతుంది. దీనితో వారికి అనుకూలంగా ఫీచర్స్ ని యాడ్ చేస్తుంది ట్విట్టర్

Read more RELATED
Recommended to you

Latest news