మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసుకోవాలా..? అయితే ఇలా ఈజీ చూసేయచ్చు..!

-

ఈ మధ్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ ఫోన్ లో ఉండటం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. క్షణాల్లో మనం మన పనులు పూర్తి చేసుకోవచ్చు.

 

అలానే సందేశాలను పంపడానికి కూడా ఇంటర్నెట్ మనకి హెల్ప్ చేస్తుంది. అయితే ఏమైనా సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలన్న లేదంటే ఏదైనా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మనకి ఇంటర్నెట్ చాలా అవసరం. ఒకసారి మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా నెమ్మదిగా డౌన్లోడ్ అవుతుంది. దీనితో మనకు సమయం వృధా అవుతుంది.

పైగా మనకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. దీనికి గల కారణం ఏమిటంటే ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడం. అయితే ఇంటర్నెట్ నిజంగా స్పీడ్ గా పని చేస్తుందా లేదా ఎంత స్పీడ్లో ఇంటర్నెట్ ఉంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ స్పీడ్ ని చూసుకోవడానికి యాప్స్, వెబ్సైట్లు కూడా ఉన్నాయి. కానీ వాటి కంటే కూడా సింగిల్ క్లిక్ తో మనం ఇంటర్నెట్ స్పీడ్ గురించి తెలుసుకోవచ్చు. గూగుల్ ఈ సదుపాయాన్ని మనకోసం కల్పిస్తోంది. అయితే మరి ఇంటర్నెట్ స్పీడ్ ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

మీ ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ గూగుల్ హోమ్ పేజీ లోకి వెళ్ళండి.
ఆ తర్వాత సెర్చ్ బార్ లో Run speed test అని సెర్చ్ చేయండి.
ఇప్పుడు మీకు ఒక డైలాగ్ బాక్స్ కనబడుతుంది.
అక్కడ Run speed test పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.
కొన్ని సెకన్ల తర్వాత డౌన్లోడ్ అప్లోడ్ వేగాన్ని చూపిస్తుంది.
మీరు కనుక రెండు సిమ్స్ ని ఉపయోగిస్తున్నట్లు అయితే మొబైల్ డేటాని వేరే సిమ్ కి మార్చండి. ఇలా మీరు ఈజీగా ఇంటర్నెట్ స్పీడ్ ని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news