గుప్పెడంతమనసు ఎపిసోడ్ 250: కాలేజ్ గస్ట్ హౌస్ లో మహేంద్రను చూసి కుప్పకూలిన రిషీ 

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో శిరీష్, జగతి మాట్లాడుకుంటూ ఉండగా వసూ వస్తుంది. శిరీష్ ఇప్పటివరకూ మేడమ్ ఎడ్యూకల్చర్ గురించి చెప్పారు..నాకు భలే నచ్చింది అందుకే పొగుడుతున్నాను అంటాడు. జగతి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని జగతి వెళ్తుంది. వసూ శిరీష్ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంకోవైపు రిషీ మహేంద్ర గదిలోకి వెళ్లి చూస్తాడు. మహేంద్ర ఉండడు..అలా ఉదయం అన్న మాటలను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఇంతలో దేవయాని వచ్చి ఏం చేస్తున్నావ్ రిషీ అంటుంది. డాడ్ వచ్చేరేమో అని అంటాడు. దొరికిందే ఛాన్స్ అనుకుని దేవయాని మహేంద్ర గురించి బ్యాడ్ గా చెప్తుంది. తను ఎక్కడ ఉంటాడో నీకు తెలుసు, నాకు తెలుసు, కొడుకుకోసం తండ్రి ఎదురుచూస్తాడు..కానీ ఇక్కడ తండ్రికోసం కొడుకు ఎదురుచూస్తున్నాడు..రాగానే మహేంద్రను అడిగేయ్ అని ఎక్కేస్తుంది. ఆ మాటలకు రిషీ వెళ్లిపోతాడు.
మరుసటి రోజు ఉదయం..జగతి మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది..ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తాడు..ఈరోజు మెసేజ్ కూడా పెట్టలేదు అనుకుని కాల్ చేస్తుంది. స్వీచ్ఛ్ ఆఫ్ వస్తుంది. రిషీ కూడా కారులో ఉండి మహేంద్రకు కాల్ చేస్తాడు. ఆఫ్ వస్తుంది. వసూ కాఫీ తెచ్చి జగతికి ఇస్తుంది. జగతి వద్దని చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఈరోజు కాలేజ్ కి రావటం లేదు ఫణీంద్ర సార్ కి మెయిల్ పెట్టాను అంటుంది. వసూ ఎందుకు మేడమ్ లీవ్ అంటుంది. జగతి ఏం వసూ నాకు లీవ్ తీసుకునే హక్కు కూడా లేదా అంటుంది. ఇంతలో రిషీ వచ్చి కార్ హారన్ కొడతాడు. వసూ రీషీ సార్ వచ్చారు అని జగతి మహేంద్ర వచ్చాడు అని ఒకేసారి అంటారు. అది రీషీ సార్ కార్ హారన్ మేడమ్ అంటుంది వసూ.. జగతి ఈ టైంలో రిషీ ఎందుకు వస్తాడు అంటుంది. వసూ నేను వెళ్లి చూస్తాను అంటే జగతి నేనే మాట్లాడతాను అని వెళ్తుంది.
డోర్ తీస్తుంది. ఎదురుగా ఉన్న రిషీ..మా డాడ్ ని పిలవండి అంటాడు. ఆయన ఇక్కడ లేరు అని జగతి అంటుంది. లేరా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు రిషీ..అంటే ఇంటికి రాలేదా, మహేంద్ర ఎక్కడికి వెళ్లినట్లు మరి అని అడుగుతుంది. నేను అడిగిన ప్రశ్నే నన్ను అడుగుతారు ఏంటి అంటాడు రిషీ. మీతో పాటు వచ్చిన డాడ్ ఎక్కడికి వెళ్లారు అని రిషీ అడుగుతాడు. జగతి ఇంట్లోకి వస్తుంటే రావొద్దన్నాను, వెళ్లిపోమన్నాను అని చెప్తుంది. రిషీ కోపంతో..మొఖం మీదే తలుపువేశారా..డాడ్ ఎంత కోపంలో ఉన్నారో తెలుసుకదా అలా ఎలా రావొద్దన్నారు, మా డాడ్ మనసు గాయపరిచారు, పాపం డాడ్ ఎంత ఫీల్ అయ్యారో ఏమో..లేకపోతే ఇలా ఇంటికిరాకుండా ఉంటారా..ఇప్పుడు డాడ్ ని ఎక్కడని వెతకాలి అంటాడు..జగతి కంగారుగా వసూ సార్ తో వెళ్లు..ఇద్దరు కలిసి మహేంద్రను వెతకండి అంటుంది. రిషీ అక్కర్లేదు అంటాడు. జగతి ఆటోలో వెళ్లమంటుంది..రిషీ కోపంగా నా వెంట రావాలని, ఫాలో కావాలని ఎ‌వ్వరు ప్రయత్నించవద్దు అని చెప్పేసి వెళ్తాడు.
జగతి వసూలు బాధగా కుర్చుంటారు. రిషీ అన్న మాటలను తలుచుకుని మహేంద్ర ఎక్కడికి వెళ్లినట్లు..రిషీతో అలా జరిగిందనే కదా మహేంద్రను రావొద్దన్నాను అంటుంది. వసూ ఏమైంది మేడమ్ మహేంద్ర సార్ రిషీ సార్ తో గొడవపడ్డారా అని అడుగుతుంది. జగతి ఏడ్చుకుంటూ ఇప్పుడు నన్నుఏం అడగొద్దని చెప్పి వెళ్లిపోతుంది. వసూకి ఫైల్ విసిరికొట్టిందానికి కారణం..నా మీద కోపంతోనే కదా అని అర్థంచేసుకుంటుంది.
రీషీ కాలేజ్ కి వస్తాడు. డాడ్ ఎక్కడికి వెళ్లారు అనుకని ఆలోచిస్తాడు. ముందురోజు మహేంద్ర జగతి కుర్చున్న ప్లేస్ చూస్తాడు..ఆ గొడవను తలుచుకుంటాడు. ఆ ప్లేస్ కి వెళ్లి నిలబడతాడు. రిషీ అదే సీన్ ( మహేంద్ర భజంపై జగతి తలవాల్చిన) గుర్తువస్తుంది. మళ్లీ మహేంద్రకు కాల్ చేస్తాడు స్విచ్ఛ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో వసూ కాల్ చేస్తుంది. రిషీ కోపంగా ఏంటి అని అడుగుతుంది. మహేంద్ర సార్ వచ్చారా అని అడుగుతుంది. రాలేదు వచ్చాకా నీకు కాల్ చేసి చెప్పాలా అని అడుగుతాడు. ఇద్దరం కలిసి వెతుకుదాం అని అంటుంది. రిషీ కోపంగా అక్కర్లేదు, కోపంగా మాట్లాడుతున్నా అర్థం చేసుకోవా అంటాడు. నేను కాలేజ్ కి వచ్చిన మొదటిరోజునుంచే మీ కోపాన్ని చూస్తున్నాను అని.. వసూ మహేంద్ర సార్ ఎక్కడికి వెళ్తారు..మీరు, జగతిమేడమ్, కాలేజ్ ఇదే కదా మహేంద్ర సార్ లోకం అంటుంది. రిషీ ఫోన్ కట్ చేస్తాడు.
వసూ మాటలు గుర్తుచేసుకుని..ఇంట్లో లేరు, జగతి మేడమ్ ఇంట్లో లేరు అంటే కాలేజ్..కాలేజ్ గస్ట్ హౌస్ అని పరిగెట్టుకుంటూ వెళ్తాడు. మహేంద్ర సోఫాలో పడుకుని ఉంటాడు. అది చూసిన రిషీ బాధపడతాడు..కింద కుర్చుని ఏడుస్తాడు. మహేంద్ర కాళ్లు పట్టుకుంటాడు. ఈ సీన్ చాలా ఏమోషనల్ గా ఉంటుంది. మహేంద్ర లేచి రిషీ ఏంటమ్నా కింద కుర్చున్నావ్..ఎంతసేపు అయింది వచ్చి అని పక్కన కుర్చుకోపెట్టుకుంటాడు. ఎంతసేపు అయింది వచ్చి అని మళ్లీ అడుగుతాడు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో వసూ కోపంగా రిషీ క్యాబిన్ కి వచ్చి లోపలికి రావొచ్చా అని అడుగుతుంది..రిషీ ఇప్పుడు కాదు అంటాడు. అయినా వసూ వినకుండా వచ్చేస్తుంది. ఇది కాలేజ్ విషయం కాదు పర్సనల్ విషయం అంటుంది. బయటకు వెళ్తారు..వసూ రిషీతో మీరు జగతి మేడమ్ కి భయపడుతున్నారు సార్ అంటుంది. నేనా జగతికి మేడమ్ కి భయపడుతున్నానా అంటాడు. వసూ మీరు జగతి మేడమ్ మీద ఒపినీయన్ మార్చుకోవాలి అంటుంది. నా పర్సనల్ విషయంలో నీ కేందుకు అంత ఇంట్రస్ట్ అంటాడు. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news