గెలిచిన ఎంపీటీసీలను గాలికొదిలేస్తున్న బాబు… వల రెడీ!

-

ప్రస్తుతం చంద్రబాబు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది! అవును… పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అయితే… అప్పటికే బీఫారాలు అందుకున్నవారు నామినేషన్లు వేశారు. దీంతో పార్టీ బహిష్కరణ పిలుపు ఇచ్చినా… కొంతమంది టీడీపీ నేతలు పోటీచేశారు. సొంతగా డబ్బులు ఖర్చు పెట్టారు. అధినేత కలిసిరాకపోయినా… దాదాపు 700 ఎంపీటీసీల్లో విజయం దక్కించుకున్నారు! మరి వారంతా ఇప్పుడు ఏమిచేయాలి?

chandrababu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించినా… స్థానికంగా బలపడాలని – పార్టీని బ్రతికించాలని ఫిక్సయిన తమ్ముళ్లు పోటీచేశారు.. గెలిచారు. విచిత్రం ఏమిటంటే… ఇప్పటి వరకు కనీసం వారికి విషెస్ చెప్పలేదు.. టీడీపీ అధినేత పలకరించిన పాపానపోలేదు. దీంతో వారంతా ప్రస్తుతం నైరాశ్యంలో మునిగిపోయారు.

అయితే… పరిషత్ ఎన్నికల్లో ఇలా పార్టీ జెండాను రెపరెపలాడించిన ఎంపీటీసీలను ప్రస్తుతం గైడ్ చేసేవారు లేకపోయారు. స్థానిక ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా బాబు ఆదేశాల కోసం చూస్తూ… వారిని అనాదలుగా వదిలేస్తున్నారు. వచ్చే నాలుగైదు ఎంపీపీ పదవులను వదులుకోలేక మరోపక్క గెలిచిన ఎంపీటీసీలు ఫీలైపోతున్నారు. కొన్ని చోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటే.. టీడీపీ ఎంపీపీ స్థానం దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి!

అయితే… ఈ కార్యక్రమానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో వీరికి సరైన దిశానిర్దేశం చేసేవారు లేక ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబు తనదైన శైలిలో స్పందించి.. పార్టీ తరఫున గెలిచిన వారిలో భరోసా నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోనీ.. అంతర్గత చర్చల ద్వారా అయినా నేతలను అక్కడకు పంపించి.. చర్యలు చేపట్టాలి! అలా కానిపక్షంలో… చంద్రబాబు మరో తప్పుచేసినట్లే!

మరోవైపు.. ఇతరపార్టీల నుంచి గెలిచిన ఎంపీటీసీలకు వైకాపా నేతలు విసురుతున్న వలల్లో టీడీపీ ఎంపీటీసిలు పడే అవకాశం ఉంది. ఇది గ్రౌండ్ లేవెల్ లో టీడీపీకి చాలా గట్టి దెబ్బ అని బాబు & కో మరిచిపోకూడదు!

Read more RELATED
Recommended to you

Latest news