గుప్పెడంత మనసు సెప్టెంబర్ 15 ఎపిసోడ్ 243: వసుధారకు చివాట్లు పెట్టిన రిషీ..తప్పు మీదీ ఉందని జగతికి క్లాస్..!

-

గుప్పెడంత మనసు :ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని ధరణీతో..ఇంటిపన్నలన్నీ అయిపోయాయా అని అడుగుతుంది. ఆ అయిపోయాయ్ అంటుంది ధరణి. ఇంటిపనలను బానే చేస్తావ్, ఇంటిలిజెంట్ పనులే చేతకాదు నీకు. ఎమ్మన్నా అంటే అమాయకత్వానికే అసలైన అడ్రస్ లా ఇలా ముఖం పెడతావ్ అంటుంది. రూంలో ఉన్న రిషీ కర్ఛీవ్ వైపు అలా చూస్తూ ఉంటాడు. నీకు నేను ఏం చెప్పినా బుర్రకెక్కదు అని దేవయాని ధరణీని తిడుతుంది. ఏమైంది అత్తయ్య అని ధరణి అడుగుతుంది. ఆ వసుధారతో రిషీ రోజంతా తిరిగి వచ్చాడు అంటుంది. నిజమా అని అడుగుతుంది ధరణీ. ఏదో శుభవార్త విన్నట్లు నిజమా అంటావేంటి.

నీ తెలివితక్కువ తనంతోనే నాకేమీ తెలియకుండా ఉంటుంది. రోజురోజుకి ఆ వసుధార రిషీకి దగ్గరవతుంది. రిషీ అన్ని విషయాలు నీతో చెప్తూ ఉంటాడు కదా..మెల్లగా రిషీని మాటల్లో పెట్టి కూపీలాగు, ఏంటీ ఏం చెప్పినా అలా చిరునవ్వు లేకుండా ఉంటావ్ అంటుంది దేవయాని. అలా అడగటం సంస్కారం కాదు కదా అత్తయ్యగారు అంటుంది ధరణి. దేవయానికి కోపం వస్తుంది. నోర్ మూయ్ అంటూ కొట్టడానికి చేయ్ లేపుతుంది. రీషీ కిందకు వస్తూ ఉంటాడు. సంస్కారం గురించి నాకు చెప్తున్నావా, పోనీలే అని ఊరుకుంటే ఎక్కవ మాట్లాడుతున్నావు, దద్దమ్మా..అందుకే నిన్ను నా కొడుకు దూరం పెట్టింది. మూడు పూటల మెక్కటం తప్ప దేనికి పనికిరావు అంటూ తిట్టి వెళ్లిపోతుంది. దేవయాని వెళ్లాక రిషీ చూస్తాడు. వదినకు ఏమైంది ఏడుస్తూ వెళ్తుంది అనుకుంటాడు.

ఇటుపక్క వసూ వంటగదిలో పని చేసుకుంటూ రిషీ పెరుగన్నం గురించి అన్న మాటలను గుర్తుచేసుకుని జగితినీ పిలిచి మోడమ్ పెరగన్నం తింటే ముఖంలో కలపెరుగుతుందా అని అడుగుతుంది. ఏం వసూ నీ ముఖంలో ఇప్పుడు కలకేం తక్కువైంది అని అడుగుతుంది జగతి. అంటే రిషీ సార్ అన్నారు..పెరగన్నం తింటుంటే అన్నారు. అంటూ కంగారుగా చెప్తుంది. ఎలా అన్నారు, ఎందుకు అన్నారని నేను అడిగానా అంటుంది జగతి. పైకి అలా కనిపిస్తారు కానీ, రిషీ సార్ అమ్మాయిలను వాళ్ల అలవాట్లను బానే గమనిస్తారు మేడమ్ అంటుంది వసూ.

ఊహూ..పైకీ ఎలా కనిపిస్తారేంటి అంటుంది జగతి. అంటే.. ఎవర్ని పట్టించుకోనట్లు కనిపిస్తార్ గా అందుకే అన్నాను. నా కొడుకిని తక్కువ అంచనా వేయకు వసూ అంటుంది జగతి. వసూ..రిషీ సార్ చిన్ననాటి అలవాట్ల గురించి అడుగుతుంది. జగతి.. నీకింతకుముందే చెప్పాను రిషీ విషయంలో ఆలోచనలు, దూకుడు రెండు తగ్గిస్తే మంచింది అని చెప్పి వెళ్లిపోతుంది. వసూ మనోవిశ్షణ చేసుకుంటుంది. మోడమ్ ఏంటో జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా మన రిషీ సార్ హే కదా అనుకుని రిషీతో డ్యాన్స్ చేసిన సీన్ గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో జగతి గట్టిగా పిలుస్తుంది. వస్తున్నావా రాత్రంతా కిచెన్ లోనే ఉంటావా అని అలా ఆ సీన్ అయిపోతుంది.

ధరణీ, దేవయాని అన్న మాటలను తలుచుకుని వంటగదిలో ఏడుస్తుంది. రిషీ వచ్చి వదినా అని పిలుస్తాడు. ఏం కావాలి రిషీ పాలేకదా నేను నీ గదికి తీసుకొస్తాను అంటుంది ధరణి. మీరు మీ బాధను దాచిన కన్నీళ్లలో కనిపిస్తుంది… అంటూ జరిగింది ఏంటో అడుగుతాడు. ధరణీ..ఏం లేదు మా వారు గుర్తొచ్చారు అంటుంది. నిజం చెప్పండి వదినా మీరు అబద్ధం చెబుతున్నారు అని అడుగుతాడు. కష్టాలేంటో, బాధలేంటో నాకు తెలుసు అంటూ.. ధరణీని నిజం చెప్పమని ఒత్తిడి చేస్తాడు. నిజం చెప్పకపోతే పెద్దమ్మని పిలుస్తాను అంటాడు.

ధరణీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమంటుంది. కానీ రిషీ కుటుంబం గురించి , కష్టాల గురించి చాలా చక్కగా వివరిస్తాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు మావయ్యగారు నేను నిజమే చెప్తున్నాను అంటుంది. తను ఇప్పుడు చెప్పడం లేదంటే ఆ బాధ ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవాలంటూ..నువ్వు ఈ ఇంట్లో ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నావో నాకు తెలుసు అని, నీకు ఏమైనా కష్టం వస్తే నాకో రిషీకో చెప్పు అని రిషీని అక్కడినుంచి బయటకు తీసుకొస్తాడు.

ఇంకేంటి రిషీ ఈరోజు చాలా అద్బుతంగా గడిచింది అంటగా అంటాడు. అంటగానా అని రిషీ అడుగుతాడు..వసూధార శిరీష్ కి అంటాడు..అంతే చెడామడా వసుధారను తిడతాడు. అనవసరంగా చెప్పానేమో అనుకుంటాడు మహేంద్ర. వసుధారకు ఏం మాట్లాడాలో తెలియదు. మేము ఏమైనా పిక్ నిక్ వెళ్లామా అందిరితో చెప్పడానికి అని చాలా మాటలు అనేస్తాడు. కోపంగా వసుధారను తిట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. మహేంద్ర నవ్వుకుంటూ ఏమైంది రిషీకి ప్రతిదాంట్లో ఏదో ఒక అర్థంతీసి అరిచేస్తూ ఉంటూడు అనుకుంటాడు.

మరుసటి రోజు ఉదయం రిషీ కాలేజ్ ముందు కోపంగా నిలబడి ఉంటాడు. వసూ ఆటోలో వచ్చి కంగారుగా లోపలికి వెళ్తుంది. ఏంటి చూసి కూడా కావాలని వెళ్తుందా.. అస్సలు నన్ను చూడలేదా అనుకుని ఫోన్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది వసూ. ఫోన్ లో కాకుండా డైరెక్ట్ కూడా చెప్పినా బాగుంటుంది అంటాడు. వెనక్కి తిరుగితే కనిపిస్తా అంటాడు రిషీ.. వసూ ఫోనులో రమ్మంటారా సర్ అని అడుగుతుంది. హా లేదు. నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా. సాయంత్రం వరకూ ఇలానే ఫోన్లో మాట్లాడుకుందాం అని ఎటకారంగా అంటాడు. వసూ అర్థమయిందని రిషీ దగ్గరకు వెళ్తుంది. నేను మిమ్మల్ని చూడలేదు అంటుంది.

నువ్వు ఇప్పుడు చూశావ్ అని ఎవరు అన్నారు అని రిషీ అంటాడు. సర్ పొద్దున్నే డ్యూటీ ఎక్కేశారా, ఇంత పొద్దున్నే కోపం ఏంటో అని మనసులో అనుకుంటుంది. ఎ‌వరితో ఏం చెప్పాలో, ఎంత చెప్పాలో తెలియదా అని అడుగుతాడు. వసూకి ఏం అర్థంకాదు. నాకు నిన్ను చాలా తిట్టాలనుంది వసుధార కాలేజ్ గ్రౌండ్ కాబట్టి సరిపోయింది అంటాడు. వసూ ఏం విషయం గురించి అని అడుగుతుంది. మనం స్లం ఏరియా విజిట్ కి వెళ్లింది అందరికి చెప్పడమేనా అంటూ తిడతాడు. నేనెవరికి చెప్పాను సర్ అని వసూ అడుగుతుంది. శిరీష్ కి చెప్పావా లేదా అని అడుగుతాడు. వసూకి దిమ్మతిరిగిపోతుంది. రిషీకి గట్టిగా క్లాస్ పీక్ తాడు. దాచుకునే వాటిని దాచుకోవాలి చెప్పుకునే వాటిని చెప్పుకోవాలి అంటూ చెడమడా తిట్టేసి వెళ్లమంటాడు. వసుధార సార్ అంటుంది. ఈ సారీలు అవి ఇవి ఏం చెప్పకు అని పంపిస్తాడు.

నాలుగు అడుగులు వేయగానే జగతి కనిపిస్తుంది. నువ్వెళ్లు వసూ అంటుంది జగతి. జగతి రిషీవైపు నడుచుకుంటూ వెళ్తుంది. రిషీ పిలుస్తాడు. ఒక్కనిమిషం మీతో మాట్లాడొచ్చా అని…పాఠాలు బాగా చెబుతారు, పద్దతులు గురించి చెప్తారు, రూల్స్ పాటిస్తారు వెరీగుడ్ అని ఇన్నిపాటించేవారు మీ ప్రియశిశ్యురాలికి ఏది చెప్పాలో ఏది దాచుకోవాలో ఏది దాచుకోకూడదో చెప్పలేదా అని అడుగుతాడు. జగతి ఏమైంది సార్ అంటుంది. శిరీష్ కి వసూ స్లంఏరియా విజిట్ గురించి చెప్పింది చెప్తాడు.

అయినా ఈ విషయంలో తప్పు మీది కూడా ఉంది. శీరిష్ ని అనవసరంగా ఏంకరేజ్ చేస్తున్నారేమే అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో వసూ పర్మిషనే లేకుండా శిరీష్ తో కలిసి బయటకు వెళ్తుంది. మీటింగ్ లో ఉన్న రిషీ వసూని పిలవమంటే బయటకువెళ్లింది అని అటెండర్ చెప్తాడు. పర్మిషన్ లేకుండా మీరు ఎ‌వర్ని బయటకుపంపరు కదా మేడమ్ మీ పర్మిషన్ తీసుకునే వెళ్లిందా అని జగతిని అడుగుతాడు రిషీ. లేదు సర్ అంటుంది జగతి. రిషీ వసూకి కాల్ చేస్తాడు. శిరీష్ వసూ ఫోన్ తీసుకుని కట్ చేస్తాడు. రిషీకి చిర్రెత్తిపోతుంది. పర్మిషన్ ఉండదు, ఫోన్ చేస్తే కట్ చేస్తుంది అంటాడు. జగతి మనసులో వసుధార నన్ను ఇలా ఇరికించింది ఏంటి అనుకుంటుంది. పూర్తివివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news