వియత్నాం కు చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా నలభై ఒక్క సంవత్సరాలపాటు అడవిలోనే జీవించాడు. దీంతో అతని పేరు రియల్ లైఫ్ టార్జాన్ గా మారిపోయింది. హూ వన్ లాంగ్… అతని అసలు పేరు. ఎంతోకాలం అడవిలో గడిపిన అతడు ఎనిమిది సంవత్సరాల క్రితమే నాగరిక ప్రపంచం లోకి అడుగు పెట్టాడు. అయితే విషాదం ఏమిటంటే… అడవులను వదిలి ప్రజల్లోకి వచ్చిన తర్వాత 52 ఏళ్ల వయసులో లివర్ క్యాన్సర్ తో కన్నుమూసాడు రియల్ లైఫ్ టార్జాన్.
వియత్నాం యుద్ధం సమయంలో లాంగ్ చాలా చిన్నవాడు. అతడికి రెండు ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ సమయంలో ఓ బాంబు అతడు ఇంటి పై పడింది. ఈ సంఘటనలో అతని తల్లి మరియు ఇద్దరు చెల్లెల్లు ప్రాణాలు కోల్పోయారు. లాంగ్ తో పాటు అతడి తండ్రి మరియు సోదరుడు ఎన్ గాయి ప్రావిన్స్ లోని టేట్ రా జిల్లాలో ఉన్న.. దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు.
చెట్లు మరియు గుహలోనే నివసిస్తూ అక్కడే వాటిని తింటూ నాలుగు దశాబ్దాలు గడిపారు. కొన్ని కారణాల కారణంగా 2013 లో గ్రామంలో వాళ్ళు అడుగుపెట్టారు. అడవి నుంచి వచ్చిన వారు ఆ గ్రామంలోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే 2017 సంవత్సరంలో అతని తండ్రి మరణించాడు. ఇక తాజాగా లివర్ క్యాన్సర్ కారణంగా రియల్ లైఫ్ టార్జాన్ కూడా మృతి చెందారు.