గుప్పెడంతమనసు ఎపిసోడ్ 278: ఫోన్ లో జగతి చెప్పిన కషాయం విని..వంటగదిలో ప్రయోగాలు చేసిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఒక్కతే కాలేజ్ కి వస్తుంది. ఓ మేడమ్ ఎదురైతే..వసూ పలకరిస్తుంది. జగతి మేడమ్ రాలేదా అంటే..వసూ జగతి మేడమ్ లీవ్ లో ఉన్నారు అంటుంది. ఆ తర్వాత రిషీ ఎదురవుతాడు. రిషీ ఓ లుక్ ఇస్తాడు. వసూ వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. రిషీ. ఏంటీ ఆ మేడమ్ తో ఏదో అంటున్నావ్..పర్సనల్స్ అయితే వద్దులే అనీ మళ్లీ మనోడే అంటాడు. వసూ నాకు దాచే అంత పర్సనల్స్ ఏం ఉంటాయ్ సార్ అంటుంది. రిషీ కొందరు చెప్తారు, కొందరు అసలు చెప్పరు అంటూ రిషీ మనసులో ఉదయం మహేంద్ర చెప్పింది గురించి ఇన్ డైరెక్టుగా మాట్లాడతాడు. అలా రిషీ విషయం బయటకు చెప్పకుండా..కొందరు అందరి పర్సనల్స్ లోకి ఎంటర్ అవుతారు కానీ..వాళ్ల పర్సనల్స్ మాత్రం చెప్పరు అంటాడు. వసూ ప్రాజెక్టుగురించి మాట్లాడుతుంది. ఇలా ఇద్దరూ ప్రాజెక్టు గురించి కాసేపు డిస్కస్ చేసుకుని..సార్ నేను అన్నీ రాసుకొచ్చాను అంటూ బ్యాగ్ లోంచి బుక్ తీయబోతుంది. అదికాస్తా పొరపాటున కిందపడుతుంది. ఇద్దరూ ఒకేసారి వంగుని తీసుకోబోతారు. ఈ సీన్ భలేగా ఉంటుంది. ఒకరి కళ్లళ్లోకి ఒకరు చూసుకుంటారు. అప్పుడే శిరీష్ ఫోన్ చేస్తాడు. రిషీ పర్సనల్ కాల్ అనుకుంటా అంటాడు. శిరీష్ కాల్ నాకు పర్సనల్ ఎలా అవుతుంది సార్ అంటుంది. మాట్లాడుకో అని రిషీ పక్కకు వెళ్లి కుర్చుంటాడు. వసూ ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఏంటి రిషీ ఇక్కడ కుర్చున్నావ్ అంటాడు. నా పర్సనల్స్ గురించి ఆలోచిస్తున్నా..ఏం ఇక్కడ కుర్చోకూడదా అంటాడు.

ఫోన్ కాల్ లో శిరీష్ ఏదో సండే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాడు. అదే విషయం వసూ మహేంద్రకు చెప్తుంది. పక్కనే ఉన్న రిషీకి కాల్తుంది..హలో మీ పర్సనల్ విషయాలు, పర్సనల్ ప్రోగ్రామ్స్ ఇక్కడకాదు..ఇది కాలేజ్ అంటాడు. మహేంద్ర వసుధారతో మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. రిషీ వసూ నువ్వునాతో రా..ఇందాక ఏదో మీ మేడమ్ రాసిన ఏడియాస్ ఉన్నాయ్ అన్నావుకదా అంటాడు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.

ఆరోజు రాత్రి మహేంద్ర ఒక్కడే ఛస్ ఆడుకుంటాడు. ఇంతలో ధరణి వస్తుంది. ఏంటి మావయ్యగారు మీరొక్కరే ఆడుకుంటున్నారు అంటుంది. ఎదుటివాళ్ల ఆటకూడా మనమే ఆడే అవకాశం ఉంటుందమ్మా ఈ ఆటలో అంటాడు మహేంద్ర. అంటే రిషీ ఆటకూడా మీరే ఆడుతున్నారా అంటుంది ధరణి..ఇలా రిషీ గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. మహేంద్ర అమ్మా ధరణి నువ్వునాకో పనిచేసిపెట్టాలి అంటాడు.

ఇంకోవైపు జగతి, వసూ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు. ఈ మధ్యకాలేజ్ లో మీటింగ్స్ ఏమైనా పెట్టారా అంటే..ఏమో మేడమ్ అంటుంది వసూ. నువ్వు ఏండిగారి అసిస్టెంట్ వి కదా అంటుంది జగతి. ఆయనగారికి కోపాలు ఎక్కువవుతున్నాయ్ అంటుంది వసూ. రిషీకి నీమీద కోపం నీటిమీద బుడగలాంటిది వసూ..కానీ నా మీద కోపమే శిలాక్షరాలుగా అలా ఉండిపోయింది ..సో మీటింగ్ గురించి నీకు తెలియదు అంటావ్ మహేంద్రకు ఏమైనా తెలిసిఉండొచ్చేమే అనుకుంటుంది. ఇంతలో ధరణి వసుధారకు ఫోన్ చేస్తుంది. మహేంద్రకి ఒంట్లోబాలేదు, అక్కడికి రాలేను అని చెప్పమన్నారు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది.

జగతి ఇక టెన్షన్ పడుతుంది. మహేంద్రకు కాల్ చేస్తుంది. స్విచ్చ్ ఆఫ్ వస్తుంది. మరోపక్క రిషీ ఉదయం మహేంద్ర అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటాడు. అటుగావెళ్తున్న ధరణీని పిలిచి..వదినా డాడ్ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. చిన్నమావయ్యగారు ఎందుకోబాగా అలిసిపోయినట్లు ఉన్నారు, పడుకున్నారు రిషీ అంటుంది. రిషీ అవునా..మాట్లాడదాం అనుకున్నాను అంటాడు రిషీ. ధరణి వెళ్లిపోతుంది. రిషీ ఈ వసుధార శిరీష్ ని పెళ్లిచేసుకుంటున్నా అనే విషయం నాకు కూడా చెప్పదా..పొగరుకదా చెప్పదులే అనుకుంటాడు.

ఇంకోసీన్ లో జగతి మహేంద్రకు ఒంట్లోబాలేదు అని చెప్పడంతో డల్ అయిపోతుంది. వసుధార తిందాం రమ్మంటే రాదు..వసూని బలవంతగా తినేందుకు పంపిస్తుంది. మహేంద్రకు ఏమైంది అని ఆలోచిస్తుంది. ఇటువైపు..రిషీ చేస్కోవసుధార శిరీష్ ని పెళ్లిచేసుకో..నా దగ్గరే విషయం దాచావంటే నిన్ను ఏమనుకోవాలి అనుకుంటాడు. ఇంతలో వసూనే ఫోన్ చేస్తుంది. ఏంటి మళ్లీ సారీలు, థ్యాంక్సులు చెప్పాలా అంటాడు. అలాంటిదేమి లేదు సార్..మహేంద్రసార్ తో ఒక నిమిషం మాట్లాడాలి..ఫోన్ స్విచ్చ్ ఆఫ్ వస్తుంది. సార్ తో ఒక నిమిషం మాట్లాడించరా అంటుంది.

సరే లైన్ లో ఉండు అని రిషీ మహేంద్ర రూంకి వెళ్తాడు. అది చూసిన మహేంద్ర కావాలనే పడుకుంటాడు. రిషీ వచ్చి ఛస్ బోర్డును చూసి డాడ్ హుషారుగా ఉన్నప్పుడే ఛస్ ఆడుతారుకదా..వదినేమో నీరసంగా ఉండి పడుకున్నారు అనింది అనుకుని మహేంద్రను లేపుతాడు..డాడ్ వసుధారమీతో మాట్లాడుతుందంట అని..వసూకూడా మహేంద్రసార్ కి ఫోన్ ఇస్తున్నారు అని జగతికి ఫోన్ ఇస్తుంది. రిషీ ఇంకా లేపుతానే ఉంటాడు..జగతి మహేంద్ర ఏమైంది నీకు, ఒంట్లో బాలేకపోతే నాతో ఒకమాట చెప్పాలిగా, గొంతుబాలేదా, జ్వరమా, నీకు జ్వరమొస్తే కషాయం తాగితే తగ్గుతుంది అని కషాయం ఎలా చేయాలో చెప్తుంది. రిషీ అంతా విని డాడ్ లేవండి హాస్పటల్ కి వెళ్దాం అంటాడు. ఫోన్ కట్ చేస్తాడు. డాడ్ కు నిజంగానే బాలేదా అనుకుని కషాయం పట్టుకొద్దాం అనుకుంటాడు. రెండువైపులా మీరే ఆడుతున్నారా అని చెక్ పెట్టివెళ్లిపోతాడు. మహేంద్ర ఆట అయిపోలేదు రిషీ ఇప్పుడే మొదలైంది అనుకుంటాడు.

వసూ అయ్యోయ్యో ఫోన్ మహేంద్రసార్ కి ఇచ్చారనుకుని మీకు ఇచ్చేశాను మేడమ్..నా పనిఅయిపోయింది. ఆన్ క్లాస్ ఇస్తారు నాకు..నాకు మూడిందే అని ఫోన్ ఇటువ్వండి మేడమ్ స్విఛ్ ఆఫ్ చేసేస్తాను అంటుంది. జగతి..ఏంటి వసూ..మహేంద్రకు ఒంట్లోబాలేకపోతే..నువ్వు రిషీ గురించి భయపడుతున్నావ్ అంటుంది. నేను రేపు వెళ్లి చూసొస్తాను మేడమ్..సార్ కి ఏం కాదు అంటుంది.

ఇక్కడ రిషీ వంటగదిలో కషాయం చేయటానికి ప్రిపేర్ అవుతాడు. ఎలా చేయాలో తెలియదు. ఇందాక ఫోన్ కాల్ లో జగతి చెప్పింది గుర్తుచేసుకుంటాడు. ఒంట్లోబాలేకపోతే తనకు చెప్పాలట..20 ఏళ్లగా ఎవరు చూసుకంటున్నారో అనుకుంటాడు. ఇంతలో ధరణి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటే కషాయం చేస్తున్నాను అంటాడు. ధరణి చెప్తుంటే రిషీ కషాయం చేస్తాడు. ధరణి ఈ కషాయం చిన్నమావయ్యాగారికేనా అంటే..ఏం వదినా మీరు తాగుతారా అంటాడు. ఎలాగొలా రిషీ కషాయం చేసి మహేంద్రకు ఇవ్వటానికి వెళ్తాడు. ఏం డాడ్ ఫీవర్ ఏం లేదుకదా అంటే..కొన్ని జ్వరాలు పైకి కనిపించవు ఏం ధరణి అంటాడు మహేంద్ర. అవును రిషీ లోఫీవర్ అంటారుకదా అదేనేమో అంటుంది ధరణి..అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో వసూ పొద్దున్నే రిషీ ఇంటికి వస్తుంది. ఏంటి ఇంతపొద్దున్నే వచ్చావ్ అంటే మహేంద్ర నేను రమ్మన్నాను అని వసూని రూంలోకి తీసుకెళ్తాడు. దొంగచాటుగా రిషీ కూడా వెళ్తాడు. రిషీని చూసిన మహేంద్ర..ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా అనుకుని వసుధారతో వసూ..ఎంగేజ్ మెంట్ విషయం ఎవరికి చెప్పొద్దు అంటాడు. వసూ సరే సార్ అంటుంది. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అనుకుంటాడు రిషీ. మహేంద్ర ఇదంతా నీ మనసులో మాట బయటపెట్టించటానికేరా అనుకుంటాడు. చూడాలి మహేంద్ర ఇంకేంచేస్తాడో.

Read more RELATED
Recommended to you

Latest news