గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ అమూల్యను రెడీ చేస్తుంది. జగతి వచ్చి వసూ చీరకట్టుకో వెళ్లు అంటుంది. వసూకి రిషీ ఓసారి చీరకట్టుకుని అందరిముందు తిరగకు అనే సీన్ గుర్తుకువస్తుంది. మేడమ్ నేను రెడీ అయ్యాను, చీరకట్టుకుని అదితట్టుకుని పడినా పడతాను, ఇలానే ఉంటాను అంటుంది. సరే వెళ్లి డ్రెస్ అయినా మార్చుకో అంటుంది. ఇటుపక్క మహేంద్ర శిరీష్ ని రెడీ చెస్తాడు. రిషీ సార్ వస్తున్నారా అని శిరీష్ అడుగుతాడు. మహేంద్ర రిషీ ఇంట్లోంచి వెళ్లిన సీన్ గుర్తుచేసుకుని హా అంటాడు. మరోపక్క రిషీ కారులో వెళ్తూ వసూ మాటలను తలుచుకుంటాడు. వసూ జ్ఞాపకాలనే గుర్తుచేసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పూజ స్టాట్ అవుతుంది. మహేంద్ర నేను అబ్బాయి తరుపు, జగతి మేడమ్ అమ్మాయి తరపు అంటాడు. శిరీష్ అమూల్యతో ఇద్దరూ కాలేజ్ లో కొలీగ్స్ హే అయినా మనకోసం ఇలా జరుపుతున్నారు అంటాడు. ఆ మాటకు జగతి , మహేంద్ర ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. పూజ మొదలవుతుంది. మహేంద్ర చిన్నగా..జగతి ఏమైంది ఏం ఆలోచిస్తున్నామ్ అంటే..రిషీతో నేను ఏ ముచ్చట తీర్చుకోలేను అని దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మహేంద్ర అంటుంది. అలా ఎందుకు అలోచిస్తున్నావ్..కొడుకుపెళ్లికోసం దేవుడి నీకు ఈ అనుభవం ఇచ్చాడేమో కదా అంటాడు. వసూ రిషీసార్ పెళ్లికోసం వీళ్లిద్దరూ ఇలా కుర్చుంటేబాగుండేది అని ఓ సీన్ ఇమాజిన్ చేసుకుంటుంది.
నిశ్చితార్థం అయిపోతుంది. అందరూ కంగ్రాస్ట్ చెప్తారు. మహేంద్ర పంతులుగారికి డబ్బులిస్తాడు. పంతులుగారు వెళ్లిపోతారు. మహేంద్ర రిషీ ఏడి అంటే..గుమ్మందాక వచ్చి వెళ్లిపోయారు అంటుంది వసూ. మహేంద్ర అంటే రిషీ అమూల్యను చూడలేదనమాట..ఇది మన మంచికేలే అనుకుంటాడు. జగతి నేను చూడనేలేదే అంటుంది. వసూ ఏంటో రిషీ సార్ ని అంచనా వేయలేం అంటుంది. అలా కాసేపు కబుర్లుచెప్పుకుంటారు. కానీ ఇక్కడ మన రిషీ మాత్రం చెరువులో రాళ్లు వేసుకుంటూ..వసుధారకు ఏమైంది, ఎంతకష్టమొచ్చిన జాబ్ చేసింది, సడన్గా ఏంటిది, ఎంగేజమ్ మెంట్ కి ఎలా ఒప్పుకుంది, వసుధారమీద ఎవరి ఒత్తిడైనా ఉందా, వాళ్లమేడమ్ ఏమైనా ఎంకరేజ్ చేసిందా, పాపం అమయకురాలు వసుధార, ఈ ఎంగేజ్ మెంట్ కి ఎలా ఒప్పుకుంది అనుకుంటాడు.
ఇటుపక్క శిరీష్ తనకు ట్రాన్స్ ఫర్ అయ్యేలా ఉంది..ఎక్కడో స్టేట్ బోర్డర్ కి ట్రాన్శఫ్రర్ చేస్తే అమూల్యకు పెళ్లి చేసినా నేనొచ్చి ఆపలేను సార్..అందుకే తొందరపడాల్సి వచ్చింది అంటాడు. వసూ తెలివైన వాడివే..అసలు మీ ప్రేమకథ ఎలా మొదలైంది అంటే..శిరీష్ సిగ్తుపడతాడు. రిషీ మళ్లీ వస్తాడు. వెళ్లాలా వద్దా, వెళ్లి చక్కగా చదువుకునే అమ్మాయి కెరీర్ ఎందుకు పాడుచేశారు అని అడుగుతా అని లోపలికి రాబోతాడు. కిటీకీలోంచి కేవలం శిరీష్, వసూనే కనిపిస్తారు. పాపం మళ్లీ రిషీ వెళ్లిపోతాడు. ఇక్కడ వీళ్లంతా సంతోషంగా బాతకాని కొడుతుంటారు. కానీ రిషీ మాత్రం బాధతో వెళ్లి కారులో కుర్చుని అలవాటులో పొరపాటుగా వసుధార సీటుబెల్టు పెట్టుకో అంటాడు. మళ్లీ గుర్తుకువచ్చి షిట్ అనుకుని స్టీరింగ్ మీదచెయివేస్తాడు. హారన్ మోగుతుంది. వసూ చూస్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది. కనీసం సోమవారం అయినా రిషీనకి తెలిసేలా చేస్తాడోలేదో మన డైరెక్టర్ చూడాలి.