గుప్పెడంతమనసు ఎపిసోడ్ 293: కాలేజే లో ఆటలపోటీలు..రిషీ వసుధారల మధ్య మాటలతూటాలు

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ చెప్పు వసుధార ఆ శిరీష్ ని పెళ్లిచేసుకుంటున్నాని నాకు ఒక్కమటైన చెప్పావా అంటూ వసూ చేయి పట్టుకుంటాడు. వసూ చేయి వదలండి సార్, ఏమైంది సార్ మీకు ఎందుకింత గట్టిగా పట్టుకున్నారు అంటుంది. రిషీ నేను ఇప్పుడు ఏమైనా అన్నానా అని అడుగుతాడు..లేదు సార్ అంటుంది వసూ. సో మనం నిన్న అనుకున్నట్లుగానే మనోడు అదంతా ఊహించుకున్నాడు అంతే. రిషీ మనసులో నేను వసూని ఇలా అడగాలని ఇంత గట్టిగా అనుకున్నానా అని, ఆర్టికల్ పేపర్స్ ని నేను లేటుగా చూశాను అంటాడు. అ విషయం చెప్తుంటే, మీరు వినిపించుకోలదు, అయినా తప్పు నాది కూడా ఉందిలే అంటుంది. సరే వెళ్దామా సార్ అంటుంది.

ఇక్కడ జగతి మహేంద్రలు వసూ ఇంకా రాలేదు అని కంగారు పడతారు. ఇంతలో వసూ వస్తుంది. టిఫెన్ చేయకుండా వచ్చేశావ్ అంటే..నేను రిషీ అనబోతుంది. మహేంద్ర మనసులో నా అంచనా కరెక్టే అనమాట అనుకుని..రిషీ నీతో మళ్లీ ఏమైనా గొడవపెట్టుకున్నాడా అంటాడు. వెనుక నుంచి రిషీ రావటం చూసి మహేంద్ర టాపిక్ మారుస్తాడు. ఎగ్జామ్స్ వస్తున్నాయ్ కదా, ప్రిపేర్ అవుతున్నావా అని..రిషీ వచ్చి ఏంటి డాడ్ ఎవర్ని పట్టుకుని ఏం అడుగుతున్నారు, తను కాలేజ్ టాపర్, కాబోయ్ యూనివర్శిటి టాపర్ అనుకుంటుంది, ఒక స్టూడెంట్ ని ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారా అంటుంది. మహేంద్ర మళ్లీ మిగతా స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే.నువ్వు స్పెషల్ క్లాస్ చూసుకోమనండి అంటాడు రిషీ. వసూ వెళ్లిపోతుంది. రిషీ బ్రేక్ ఫాస్ట్ చేశావా అని మహేంద్ర అంటే..చేశాను డాడ్..బ్రేక్ ఫాస్ట్ రెండు బాక్సులు అని రిషీ అనబోతే..రిషీ పదా పదా మనకు మీటింగ్ ఉంది అని తీసుకెళ్తాడు. జగతి మనసులో మహేంద్ర ఏంటికొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది.

కాలేజ్ నోటీస్ బోర్డులో ఎగ్జామ్స్ ముందు ఆటపాటలతో విందు ప్రోగ్రామ్ అని పెడతారు. అది చూసి వసూ పుష్పా సంతోషపడతారు. రిషీ సార్ ఐడియా బాగుందికదా అని పుష్పా అంటుంటి అప్పుడే రిషీ అటుగా వెళ్తూ అక్కడ ఆగుతాడు..రిషీ సార్ కదా మరీ, ఫియర్ ఫ్రీ ప్లే టైమ్ ఇదేదో ఇంగ్లీష్ ఉంది..పరీక్షల ముందు పదనిసలు అని పెడితే బాగుండేది అంటుంది. అయినా మాకు ఎగ్జామ్స్ అంటే నీకు కాదుగా అని పుష్పా అంటే..నాకు రిషీ సార్ అంటే భయం అని వసూ అంటుంది. అవును ఆర్టికల్ రాసినందుకు రిషీ సార్ కి కోపం తగ్గిందా అని పుష్పా అడుగుతుంది. కొంచెం తగ్గినట్లే ఉంది, మార్కెట్ లో ధరలాగా రిషీ సార్ కోపాన్ని అంచానా వేయలేము, అప్పుడే తగ్గుతుంది,అంతలోనే పెరుగిపోతుంది. అంటుంది. రిషీ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.

రిషీ ఓ మీంట్గ్ కండెక్ట్ చేస్తాడు. పరీక్షల ముందు విద్యార్థులను రిలీఫ్ చేయటానికే ఫియర్ ఫ్రీ గేమ్స్ ముఖ్య ఉద్దేశం. ఎలాంటి గేమ్స్ డిజైన్ చేద్దాం అని రిషీ అడుగుతాడు. మహేంద్ర కబడ్డీ, కోకో లాంటి గేమ్స్ చెప్తాడు. శారీరకంగా వాళ్లను శ్రమ పెట్టొద్దు, వాళ్లతో పాటు స్టాఫ్ కూడా ఆడాలి అని గుర్తుంచుకోండి అంటాడు. జగతి క్విజ్ కాంపిటీషిన్ ని సజెస్ట్ చేస్తుంది. రిషీ మెదడుపైన మళ్లీ శ్రమ ఉంటుంది. వాళ్లకు ఫ్రీగా ఉండేవి చేయాలి అని..ప్రోగ్రామ్ గురించి రిషీ దిశానిర్దేశం చేస్తారు.

క్లాస్ లో వసూ శిరీష్ కి కాల్ చేసి ఈ ప్రోగ్రామ్ గురించి చెబుతుంది. రిషీ సార్ ఏం చేసినా భలే వెరైటీగా ప్లాన్ చేస్తారు అని వసూ అంటుంది. రిషీ సార్ లేకుండా నువ్వు మాట్లాడలేవా అంటాడు..అలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే..రిషీ వస్తాడు. సరిగ్గా శిరీష్ పెళ్లి టాపిక్ తీసినప్పుడే రిషీ వస్తాడు. వసూ ఎప్పుడూ పెళ్లి పెళ్లీ ఇదేనా..ఎంగేజ్ మెంట్ అయ్యే వరకూ చంపావ్..మహేంద్ర సార్ ని పిలిచి మీటింగ్ లు మీద మీటింగ్ లు పెట్టావ్, సరే అది అయ్యింది కదా అనుకుంటే మళ్లీ పెళ్లి, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా..ముందు ఈ ఫియర్ ఫ్రీ ప్రోగామ్ అవ్వనీ అప్పుడు చూద్దాం అంటుంది వసూ. సరే నువ్వు ఆడుకో అని ఆల్ ది బెస్ట్ చెప్తాడు శిరీష్, ఎవరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నావ్, ఆల్వేస్ విన్ మనమే కదా అంటుంది వసూ. ఏంటి అంత కాన్ఫిడెన్స్ హా అని శిరిష్ అంటే..కాన్ఫిడెన్స్ కి కేరాఫ్ అడ్రస్, విజయానికి కేరాఫ్ అడ్రస్ ఈ వసుధార అంటుంది. ఈ మాటలు అన్నీ విన్న రిషీకి కాల్తా ఉంటుంది. డోర్ ని ఒక్క తన్ను తన్ని వెళ్తాడు. సౌండ్ రావటంతో శిరీష్ ఏమైంది అంటే..ఎవరో వచ్చినట్లు ఉన్నారు అంటుంది వసూ.

కట్ చేస్తే ప్రాగ్రామ్ స్టాట్ అవుతుంది. రిషీ ఓపెనింగ్ స్పీచ్ ఇస్తాడు. జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలి అని వసూ వైపు చూసి.కొందరు అదవుతాం ఇదవుతాం అని మాటలు చెప్తారు కానీ, ఇంకేదో చేస్తారు అంటాడు. మహేంద్ర నువ్వు వసూ గురించే మాట్లాడుతున్నావ్ కదా రిషీ..అంతలా ఆలోచిస్తావ్ కానీ బయటపడవేంట్రా బాబు అనుకుంటాడు. రిషీ స్పీచ్ ఇస్తా ఉంటాడు. గెలవటంలో ఉన్న కిక్క్ ని మీరు ఆస్వాదించటం నేర్చుకోవాలి, మళ్లీ వసూని చూసి కొందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ లు ఉంటాయ్, మనమేంటో మన బలమేంటో, ఇది ఆట మాత్రమే కాదు పోటీ అని గుర్తుంచుకోండి అని తర్వాత వివరాలు మేడమ్ గారు చెప్తారు అని కుర్చుంటాడు.

జగతి పోటీల గురించి వివరిస్తుంది. మొదటి ఆట చేతులను టేబుల్ పై పెట్టి ఎవరు ముందు డౌన్ చేస్తే వారే ఓడిపోతారు అంటారుగా ఆ ఆటనే ఆడతారు. మొదటి రౌండ్ లో మా జట్టు నుంచి జగతి మేడమ్ వస్తున్నారు అని మహేంద్ర అంటే..మా జట్టు నుంచి పుష్పా వస్తుంది అంటుంది వసూ. పుష్పా, జగతి మేడమ్ రెజిలింగ్ హ్యాండ్ స్టాట్ చేస్తారు. పుష్పా చేతిలో జగతి ఓడిపోయేలా ఉంటుంది. సరిగ్గా అదే టైంకి రిషీ మేడమ్ మీరు ఓడిపోకూడదు అంటాడు. అంతే..బ్యాక్ గ్రౌండ్ లో తందానేనానే సాంగ్..జగతి కళ్లల్లో ఎమోషన్ ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో వసూ, రిషీలు పోటీకి కుర్చుంటారు. ఏంటీ నాతోనే పోటీయా అని రిషీ అంటే..పోటీ గట్టిగానే ఉండాలి కదా సార్ అంటుంది వసూ. ఏంటి ఆడి గెలుద్దామనే అని రిషీ అంటే..వసూ కూడా ఆడితేనే కదా సార్ తెలుస్తుంది గెలువు ఎవరిదో అంటుంది.. రిషీ వసూ చేతికి ఆ రింగ్ చూస్తాడు. చూడాలి ఏం అవుతుందో మరీ రేపు.