కార్తీకదీపం సెప్టెంబర్ 22 ఎపిసోడ్ -1152: స్కూల్లో పిల్లలకు నిజం చెప్పేసిన స్నేహితులు..పిల్లల్లో మొదలైన మనోవేదన

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో జైల్లో ఉన్న మోనిత తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. మోనిత జైలుకి వెళ్లింది, కార్తీక్ ని బుట్టలోవేసుకుందామం అనుకుంటున్నావా దీపక్కా..ఛాన్సేలేదు, మోనిత ఇక్కడ ..మనం ఏడిపించే టైపే ఏడ్చేటైప్ కాదు..ఇక్కడ కుర్చోనే అక్కడ నీకు చుక్కలు చూపిస్తాను నీ మీద ఒట్టు దీపక్కా అంటూ ఒక్కతే అరుచుకుంటుంది.

ఇంకోవైపు కార్తీక్ పిల్లలతో కళ్లగంతల ఆట ఆడుకుంటూ ఉంటాడు. సౌందర్య, ఆనంద్ రావ్ చూస్తారు. చాలా రోజులకి ఈ ఇంట్లో ఆనందాల కేరింతలు వినిపిస్తున్నాయ్ కదా సౌందర్య అంటాడు ఆనంద్ రావు..అవునండి అని కార్తీక్ గురించి నాలుగు మాటలు చెప్తుంది. ఈ ఆనందాలు ఈ సంతోషాలు ఇలాగే కొనసాగాలని తదాస్తు దేవతలు దీవించాలి అని సౌందర్య అంటుంది. ఆనంద్ రావు తెగ ఆనందపడతాడు. సౌందర్యమాత్రం మనసులో ఎంతోకొంత మిగిలేవుందని అనకుంటుంది.

ఇంతలో దీప కాఫీ పట్టుకుని వస్తుంది. సౌందర్య నా కొడుకు ఆటలో అయినా జీవితంలో అయినా గెలవాలి అంటుంది. హిమను పట్టుకుంటాడు. కళ్లకు గంతలు ఉన్నా కార్తీక్ దీప నువ్వొచ్చావ్ కదా అంటాడు. ఈ సీన్ చాలా బాగుటుంది. శ్రావ్య, ఆదిత్యలు చూసి అన్నయ్య ఈ ఆనందాన్ని పదేళ్లు మిస్స్ అయ్యాడు అంటాడు. అయిపోయిందాని గురించి ఎందుకులే అంటుంది శ్రావ్య. జీవితం స్క్రీప్ట్ ని మనం రాసుకోలేంగా అంటాడు ఆదిత్య. సౌందర్య పిల్లలకు స్కూల్స్ ఓపెన్ చేశారు ఆ విషయం కనుక్కోని ఫీజ్ కట్టరా అంటుంది. అలా స్కూల్ గురించి కాసేపు మాట్లాడుకుంటారు. రూంలోకి వచ్చి కార్తీక్ త్వరగా రెడీగా అంటాడు. దీప మనసులో రాత్రి అమెరికా పోదాం అన్నారు, ఇప్పుడేమో పిల్లల స్కూల్ ఫీజ్ కట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు, మనసు మార్చుకున్నారా అనుకుంటుంది. దేవుడిని అమెరికా ప్రయాణం క్యాన్సిల్ అయ్యేలా చూడు అని మొక్కకుంటుంది. అలా అందరు స్కూల్ కి బయలుదేరతారు.

మరోవైపు జైల్లో ఉన్న మోనిత ఏం చేయాలి, దీప నా కార్తీక్ మనసు మార్చకముందే ఏదోఒకటి చేయాలి అనుకుంటూ ఉంటది. జైలు శిక్ష పడిందని సాడ్ గా బ్యాడ్ గా బాధపడుతూ ఉంటుందని అనుకుంటున్నావా దీపక్కా..నో సాడ్ నో బ్యాడ్ ఓన్లీ లవ్ అనుకుంటూ సామెతలు వేసుకుంటుంది. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎ‌వరికో కడుపునొప్పి వచ్చిందని వచ్చి చూడమని తీసుకెళ్తుంది.

కారులో పిల్లలు, దీప స్కూల్ కి వెళ్తూ ఉంటారు. వెనక ఉన్న పిల్లతో కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటాడు. దీప ముందుకుచూసి డ్రైవింగ్ చేస్తారా అంటుంది. పిల్లలు నాన్న ఎప్పుడూ నువ్వే డ్రైవింగ్ చేయాలా, అమ్మకు నేర్పించు అంటారు. అలా మాట్లాడుతూ..కార్తీక్ ఆ ముచ్చట కూడా తీరిందిరా..కారు నేర్చుకుంటూ గతంలో దీప (విహారి) కాలువిరగొట్టిందని చెప్తాడు. దీపకు గతం గుర్తుకువస్తుంది. పిల్లలు పదే పదే ప్రశ్నలు అడుగుతారు..అలా అని నేను ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను రా అంటాడు కార్తీక్..లైట్ తీసుకున్నా అని ఎంత సింపుల్ గా చెప్పేశారు డాక్టర్ బాబు ఇదే మాట పదకొండేళ్ల ముందు చెప్పాల్సింది కదా అనుకుంటుంది. పిల్లలను స్కూల్ లో దింపి కార్తీక్ దీపను ఒకదగ్గర దింపుతాడు. కార్డు ఇస్తాడు, మిక్సీ కొంటానికి నువ్వు వెళ్లాల వారణాసికి చెప్తే తెస్తాడు కదా అంటాడు. దీప వంటలక్కను కదా అలవాటైంది అంటుంది. అలా కారు దిగి వెళ్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. దీప ఏదో సిక్రెట్ పనిమీదే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. తరువాయి భాగంలో స్కూల్లో ఉన్న పిల్లలకు వాళ్ల ఫ్రెండ్స్ కార్తీక్ జైలుకు వెళ్లాడంటగా..మీ డాడ్ బ్యాడ్ బాయ్ అని అంటారు. మోనితకు మీ డాడ్ కి మధ్య ఏదో ఉందని చెప్తారు. ఆ మాటకు శౌర్య, హిమలు బాధపడతారు. ఇంకోవైపు కార్తీక్ తో డాక్టర్ భారతి మోనిత గురించి మాట్లాడుతూ ఉంటుంది. చూద్దాం రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుంతుందో.