Rana Naidu: రానా క‌ల నేర‌వేరింది.. ఇక‌ బాబాయ్‌, అబ్బాయి ఓకే స్క్రీన్‌లో..

-

Rana Naidu: ద‌గ్గుపాటి రానా చిర‌కాల నేర‌వేరింది. త‌న బాబాయ్ విక్ట‌రీ వెంకటేష్ తో న‌టించాలనే కోరిక ఇన్నాళ్లకు నేర‌వేరింది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి స్క్రీన్ పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది.

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు ‘రానా నాయుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందులో రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సిరీస్ కి సంబంధించి రానా, వెంకటేష్ లుక్ కూడా విడుదల చేశారు. వీరిద్ద‌రి లుక్స్ ఇంట్రెస్టీగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వెంకీ వైట్ హెయిర్ చాలా బాగుంది.

ఈ సీరిస్ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ వెబ్‌ సిరీస్‌తో కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ రే డొనోవన్ కి ఇది అధికారిక రీమేక్.

ఇక సోషల్ మీడియా వేదికగా రానా, వెంక‌టేష్ త‌మ సంతోషాన్ని పంచుకున్నారు. పసివాడిగా నేను ఎరిగిన రానా మంచి నటుడిగా మారడం చూశాను. రానా నాయుడులో రానా మరింతగా అలరిస్తాడని.. వెంకటేష్ ట్వీట్ చేశారు. ఇక రానా త‌న ట్విట్ట‌ర్‌లో ఇలా రాసుకోచ్చారు. బాబాయ్ వెంకటేష్ తో స్క్రీన్ పంచుకోవాలని అనేది నా చిరకాల కోరిక, అది ఇప్పుడు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news