కార్తీకదీపం ఎపిసోడ్ 1167 : భాగ్యం రీఎంట్రీ..కార్తీక్ పై విరుచుకుపడిన హిమ..నువ్వు తప్పుచేశావ్ డాడీ అంటూ ఫైర్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కింద సౌందర్య ఇంకా గ్యాంగ్ అంతా మాట్లాడుకుంటారు. లోకానికి నచ్చచెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో పిల్లలకు మాత్రం నచ్చచెప్పాలి అంటుంది. ఆ మాటకు ఆదిత్య నచ్చచెప్పటం అంటే మళ్లీ ఇంకో అబద్ధం చెప్పటమా అంటాడు. ఆదిత్య పిల్లలు నిజం చెప్పమంటాడు. కానీ దీప, ఆనంద్ రావులు మాత్రం వాళ్లు పిల్లలకు నిజం ఎలా చెప్తాం రా అంటారు. ఇంతలో కార్తీక్ కిందకు వస్తాడు. సౌందర్య పేపర్ లో మోనిత ఆర్టికల్ హిమ చూసిందని చెప్తుంది. కార్తీక్ వాట్ అలా ఎలా చూస్తారు నువ్వేం చేస్తున్నాం దీప అంటాడు. నేను దాచిపెట్టాను కానీ చూసేసారు అని మిమల్ని కలిసి వెళ్దామని హాస్పటల్ కి వచ్చిందంట. మీరు ఆపరేషన్ థియేటర్ లో బిజీగా ఉన్నారని వచ్చేసిందంట అని చెప్తుంది. కార్తీక్ కి మోనిత అన్న మాటలను హిమ వినేసిందా అని డౌట్ వస్తుంది. సౌందర్య హిమకు నువ్వంటే వల్లమాలిన ప్రేమరా, వెళ్లి కొంచెం సేపు బతిమిలాడితే అదే మాట్లాడుతుంది అంటుంది. హిమ నాతో మాట్లాడకపోతే బతిమిలాడుకుంటాను, లేకపోతే దాని కాళ్లైనా పట్టుకుంటాను అంటాడు. పుట్టినరోజునాడు ఏంటి ఆ మాటలు అంటే..కార్తీక్ హిమతో మాట్లాడటానికి బయటకు వెళ్తాడు. ప్రియమణి ఈ సీన్ అంతా చూస్తూ విలన్ లుక్స్ ఇస్తూ ఉంటుంది.
జైల్లో మోనిత ఆపిల్స్ తెప్పించి సాటి ఖైదీలందరికి పంచు ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు, నా కార్తీక్ పుట్టినరోజు అని సుకన్యతో అంటుంది. కార్తీక్ బర్డే ప్రకటన పేపర్లో వేయిస్తుంది. కార్తీక్ ఇంటికి రాని పేపర్లో కావాలనే వేయించాను, ప్రపంచానికి నేను కార్తీక్ రెండో భార్యను అని తెలిసిలే చేస్తాను, మిమ్మల్ని మానసికంగా సిద్దం చేస్తాను అనుకుంటుంది.
ఇంకోసీస్ లో భాగ్యం భర్త మురళీకృష్ణ నిద్రపోతూ ఉంటాడు. ఏంటి భాగ్యం ఇంకా లేవలోదా.ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చాక గురకపెట్టి నిద్రపోతుందేమో అనుకుంటాడు. ఇంతలో భాగ్యం సౌండ్..ఏంటిది అనుకుంటూ ఇంటి సభ్యులు ఇంకా లేవలేదా, నేను జట్టునాయకురాలని కావొద్దని మీ అందరికి ఉందికదా, ఈ ఇంటిని శుభ్రంగా ఉంచాలని తెలియదా అంటుంది. ఇలా భాగ్యం బిగ్ బాస్ హోస్ లో లాగా మాట్లాడుతుంది. భలే కామెడిగా ఉంటుంది. మురళీకృష్ణకు ఏం అర్థంకాదు. ఇంకా ఆ ఇంటిలోనే ఉన్నట్లు ఉందే అనుకుంటుందేమో..ఎప్పుడు మాములు మనిషి అవుతుందో అనుకుంటాడు.
ఇంకోవైపు హిమ ఒక్కతే బయట కుర్చుని ఉంటుంది. కార్తీక్ వచ్చి హిమ ఏంటమ్మా ఇది, నీకు నా మీద కోపం ఉంటే తరువాత చూపించూ నాకు బర్డే విషెస్ చెప్పమ్మా అంటూ పాపం కార్తీక్ దిగాలుగా మాట్లాడతాడు. కార్తీక్ వెనకే సైన్యం అంతా వచ్చి కొంచెం దూరంలో నిలబడి ఉంటారు. ఈ ప్రియమణి కూడా దొంగచోటుగా వింటుంది. కార్తీక్ హిమ పక్కను కుర్చుని బుజ్జగించబోతాడు..హమ జెట్ స్పీడ్ లో లేచి డోంట్ టచ్ మీ డాడీ అని గట్టిగా అరుస్తుంది. కార్తీక్ హిమ నన్ను డోంట్ టచ్ అంటున్నావా, నేనేం తప్పు చేశానుమ్మా అంటాడు. పేపర్ లో రాసింది అబద్దాలు అంటారా, అయితే మోనిత ఆన్టీ హాస్పటల్ కి ఎందుకు వచ్చింది, మోనిత ఆన్టీ హాస్పటల్ కి వచ్చి నీతో మాట్లాడటం నేను చూశాను, మీరెం మాట్లాడుకున్నారో కూడా విన్నాను డాడీ అంటుంది. మోనిత హాస్పటల్ కి రావటం ఈ సౌందర్య అండ్ బ్యాచ్ కి తెలియదుగా షాక్ అవుతారు. కార్తీక్ మోనిత వచ్చింది కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అంటాడు. నీకు అన్నీ తెలుసు, కానీ చెప్పరు, అన్నీ అబద్ధాలు చెప్తారు, నువ్వు తప్పు చేశావ్ డాడీ, నువ్వు అమ్మను మోసం చేశావ్ డాడీ అంటుంది. కార్తీక్ హిమ నేను ఏ తప్పు చేయలేదు అమ్మా, ఎవర్ని మోసం చేయలేదమ్మా అంటాడు. హిమ అన్నీ అబద్దాలే..అబద్ధాలే చెప్తావ్ డాడీ.. హాస్పటల్ లో మోనిత ఆన్టీ అంది కదా, విజయనగరంలో మేము దొరికితే..పెళ్లి చేసుకుంటా అన్నావని, నన్ను ఎందుకు మోసం చేశావ్ అని మోనిత ఆన్టీ అడిగింది కదా, నువ్వు తప్పు చేయకపోతే, మోనిత ఆన్టీని మోసం చేయకపోతే నిన్న ఎందుకు హాస్పటల్ లో మాట్లాడలేదు అంటుంది. తనేదో వాగుతుంటే, అలా హాస్పటల్ లో అందరిముందు అరవటం బాగోదు అందుకే ఏం మాట్లాడలేదు, తప్పు చేసింది మోనితరా అందుకే తను జైల్లో ఉంది అంటాడు.
హిమ నువ్వే తప్పు చేశావ్, నీకోసమే మోనిత ఆన్టీ జైలుకి వెళ్లింది అంటాడు. పాపం ఆ మాటకు కార్తీక్ మోకాళ్లమీద కుర్చుని నువ్వు తప్పుగా అర్థంచేసుకుంటునావమ్మా అంటూ దన్నం పెడతాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో హిమ దీపతో నాకు ఈ ఇల్లు నచ్చటం లేదమ్మా, బస్తీకి వెళ్లిపోదాం అంటుంది. దీప కార్తీక్ దగ్గరకు వచ్చి హిమను నొప్పించలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంది. దీన్నిబట్టి మళ్లీ బస్తీప్లాన్ చేశారేమో..ఇప్పటివరకూ దీప వెళ్తా అనేది, ఇప్పుడు హిమ. ఇంకా ఈ ప్రియమణి మొత్తం చూస్తూనే ఉంటుంది. మోనితకు మోస్తుంది జరిగిందంతా.