కార్తీకదీపం September 4th – Episode 1136 :దీపకు నిజం చెప్పబోయిన కార్తీక్.. ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిన మోనిత

Karthika Deepam Episode 1136: కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ మోనిత గురించి ఆలోచిస్తూ…ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాను..దీపకు అన్యాయం చేయను అనుకుంటూ ఉంటాడు..ఇంకోపక్క రత్నసీత ,మోనిత ఇద్దరు మాట్లాడుకుంటారు. రత్నసీత మోనితను మీకు ఒక మాట చెప్తా ఏమి అనుకోరు కదా మేడమ్ అని అంటుంది. మోనిత చెప్పు నువ్వు నా మనిషివే కదా అంటుంది.
రత్నసీత అమాయకంగా…ఎలాగో ఇన్ని రోజులు కార్తీక లేకుండా ఉన్నారు..ఇప్పుడు మీరు ప్రగ్నెంట్ కదా..బిడ్డతో సంతోషంగా ఉండొచ్చు కదా అని సలహా ఇస్తుంది.

September 4th – Karthika Deepam Episode 1136

ఆ మాటకు చిర్రెత్తిపోయిన మోనిత నువ్వు కాబట్టి ఏం అనటంలా..అదే ఇంక ఎవరైన అయితే..షూట్ చేసుండే దాన్ని అంటుంది.. నన్ను ఇంత దగ్గర నుంచి చూసి కూడా నువ్వు ఈ మాట ఎలా అనగలుగుతున్నావ్ అంటుంది. మరి డాక్టర్ బాబు ఏమో పట్టనట్లు ఉంటున్నారు..జరుగుతుందమ్మా అని రత్నసీత అడుతుంది. జరుగుతుంది..కార్తీక్ కు ఫ్యామిల్ సెంటిమెంట్ ఎక్కువ..మనం కార్తీక్ హాస్పటల్ నుంచి జైల్ కి జైల్ నుంచి కోర్టుకు వెళ్లే లోపే బెదిరించి పెళ్లి చేసుకోవాలి..నువ్వు నేను చెప్పిన పని చేయ్ చాలు అంటుంది మోనిత.

ఇంకోపక్క భాగ్యం దేవుడితో తన బాధ చెప్పుకుంటుంది. ఉపవాసం ఉంటున్నా…నేను చేసిన తప్పుకు. నా అల్లుడు క్షేమంగా తిరిగివచ్చేలా చేయ్ స్వామి అని చెప్పి బాధపడుతుంది. ఆరోజు రాత్రి దీప డాక్టర్ బాబుకు టాబ్ లెట్ ఇవ్వటానికి సర్థతుంది. కార్తీక్ మోనిత మాటలును, మాయలను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. దీప టాబ్ లెట్ ఇచ్చి చెప్పండి ఏం ఆలోచిస్తున్నారు..ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతుంది..కడుపులో నొప్పికి కలవరపాటుకు తేడా ఉంటుంది..ఎందుకు మీరు మీలా లేరు అంటుంది. నీకు అలా అనిపించిదేమో అని కార్తీక్ అంటాడు. కాదు కనిపించింది అంటుంది దీప.

నా మనసు మనసులో లేదు అంటాడు కార్తీక్..ఎప్పుడు లేనిది ఎందుకు ఇంత కలవరపడుతున్నారు అని దీప అంటుంది. కార్తీక్ మనసులో టీ తెచ్చింది, సోదెమ్మగా వచ్చింది మోనితే అని చెప్తే…దీప మోనితను పట్టుకోవటంలో ప్రాణాలను సైతం లెక్కచేయదు అనుకుంటాడు..ఇంతలో దీప నాక్కూడా చెప్పారా..మనషుల మీద నమ్మకం పోయిందా మీకు అని అడుగుతుంది. నువ్వు అలా అనకు దీప అని కార్తీక్ అంటాడు..నాకు టీ తెచ్చింది మోనితా అనే నాకు అనిపిస్తుంది అంటాడు..దానికి దీప అంత ధైర్యంగా ఎలా పోలీస్ స్టేషన్ కు వస్తుంది కానీ.. మోనిత బతికే ఉంది అనేది మాత్రం నిజం అంటుంది. కార్తీక్ మైండ్ వాయిస్…మోనితను ఎంత తక్కువ అంచనా వేస్తున్నావ్ దీప అనుకుంటాడు..దీప మీరు ప్రశాంతంగా పడుకోండి డాక్టర్ బాబు అని చెప్తుంది..

ఇంకోపక్క శ్రావ్య ఆదిత్యకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆనంద్ రావు వచ్చి ఏంటమ్మా ఇంకా ఆదిత్య రాలేదా అని అడుగుతాడు..లేదు మావయ్య నేను అదే చూస్తున్నా..అంటుంది. వస్తాడు లే కంగారుపడకు..దీపుగాడు పడుకున్నాడా అంటాడు. లేదు పిల్లల ఆడుకుంటున్నారు అని అంటుంది. ఇక కాసేపు దీప గురించి కార్తీక్ గురించి మాట్లాడుకుంటారు. రేపు బావగారు కోర్టుకు వెళ్లాలంటగా అని శ్రావ్య అడిగితే..అవునమ్మా ఆపని మీదే ఆదిత్య లాయర్ ను కలవటానికి వెళ్లాడు.. వచ్చాక ఓసారి నన్ను కలవమను అంటాడు.

ఆదిత్య బైక్ పై ఇంటికి బయలుదేరతాడు…రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నట్లు బోర్డు పెట్టి ఉండతంతో తప్పు డైరెక్షన్ ను ఆదిత్య తిరిగుతాడు..అక్కడ తాడు కట్టి ఉండటంతో ఆదిత్య సడన్ గా కిందపడతాడు. ఇదంతా మొదటే కార్తీక్ కలగా వచ్చి లేస్తాడు..ఏమైంది డాక్టర్ బాబు అని దీప అడిగితే..మనవాళ్లకు ఏదో అయినట్లు అనిపించింది అంటాడు. ఇంతలో మోనితా ఫోన్ చేస్తుంది..నర్స్ తీసుకొచ్చి డా.రీనా అని కార్తీక్ కి ఇస్తాడు..మోనిత మరిది గారికి యాక్సిడెంట్ చేయించా..చెప్పినమాట వినకపోతే..గాయాలతో కాదు..ప్రాణాలే తీసాస్తా అంటుంది.

దీప ఈ టైంలో డాక్టర్ ఎందుకు ఫోన్ చేసింది అని అడిగితే.. ఖైదీని కదా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.నాకేమైనా అయితే వాళ్ల ఉద్యోగాలకు ప్రమాదం అని కవర్ చేస్తాడు. ఇంతలో శౌర్య ఫోన్ చేసి బాభై కి యాక్సిడెంట్ అయిందమ్మా నువ్వు రా భయంగా ఉంది అని చెప్తుంది. దీప మీకు ముందే ఎలా తెలిసింది డాక్టర్ బాబు..మన కుటుంబానికి ఏదో పట్టుకుంది అని చింతిస్తుంది. హా అవును మోనిత దేయ్యం పట్టుకుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు… సరే నువ్వు జాగ్రత్తగా వెళ్లు దీప శ్రావ్య భయపడుతుంది అని దీపను పంపిస్తాడు.

దీప ఇంటికొచ్చే సరికి ఆదిత్య గాయాలకు శ్రావ్య ఏడ్చుకుంటూ మందు రాస్తూ..కార్లో వెళ్లొచ్చుకదండి అంటుంది.. ఆ లాయర్ ఇంటికి కార్ వెళ్లే వీలు లేదు అందుకే బైక్ మీద వెళ్లాను లే అంటాడు..దీప ఏడ్చుకుంటూ వచ్చి ఏంటి ఆదిత్య ఇది ఎలా అయింది అని ఏడుస్తుంది..ఏం కాలేదు వదిన చిన్న దెబ్బలే అంటాడు.. హెల్మెట్ ఉండటం వల్ల తలకి దెబ్బ తగల్లేదు అని శ్రావ్య అంటుంది. ఆనందరావు.. అవును లాయర్ విషయం ఏమైంది అని అడుగుతాడు. పక్కనే పిల్లలు ఉండటంతో ఆదిత్య తర్వాత మాట్లాడతా అంటాడు..శౌర్య నాన్న ఎలా ఉన్నారమ్మా అని అడుగుతుంది. మిమ్మల్ని బెంగ పెట్టుకోవద్దు అన్నాడు అంటుంది దీప..హిమ నాన్న రేపు వచ్చేస్తారా అని అడుగుతుంది..దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.