Ugadi 2021: ఇది కదా ఉగాది అంటే…!

-

ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం అవడం. ఇది ప్రతి ఏడూ వసంత కాలం లో వస్తుంది. ఇది తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి రోజు. అయితే చాలా మందికి ఉగాది అంటే ఏమిటి అనేది తెలియదు. ఈ రోజు చాలా ముఖ్యమైన వాటిని ఆచరిస్తూ ఉంటారు. ఉగాది పచ్చడిని తీసుకోవడం, పంచాంగ శ్రవణం చేయడం ఇలా ఎన్నో ఉంటాయి. అయితే ఈ ఉగాది రోజు చేయవలసిన పనులు గురించి ఈ రోజు మనం చూద్దాం..!

ఉగాది పచ్చడి :

షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆనందంగా ఉండొచ్చు అని ఏ బాధా లేకుండా ఉండవచ్చని అంటారు. వైద్య పరంగా చూసుకుంటే ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని అంటారు.

పంచాంగ శ్రవణం:

తిథి వార నక్షత్రాలు ఆధారంగా మన భవిష్యత్తు ని చూస్తారు. పంచాంగశ్రవణం నాడు పండితుల వద్ద కి భక్తులు వచ్చి పంచాగశ్రవణాన్ని ఆలకిస్తారు. ఆ ఏడాదిలో కలిగే మంచి చెడు అన్నిటినీ ముందుగానే తెలుసుకుని వ్యవహరిస్తూ ఉంటారు. దీనిని ఎప్పటి నుంచో పాటిస్తూనే వస్తున్నారు.

కవి సమ్మేళనం:

ఉగాది రోజు కవులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని కవిసమ్మేళనం చేసుకుంటారు. వాళ్ళ కలం నుంచి జాలువారిన కవితలను, పద్యాలను అందరికీ వినిపిస్తారు.

ఉగాది పూజ:

ఉగాది నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేసి తర్వాత సూర్యనమస్కారం చేయాలి. వేసవి మొదలవుతుంది కాబట్టి పేదలకు దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news