భారీగా క్షీణించిన బంగారం ధ‌ర‌.. వెండి ధరలూ..

-

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా క్షీణించింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,680 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయలు తగ్గి 36,370 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 46,800 రూపాయలకు దిగివచ్చింది.

ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు తరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గి 38,350 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తరుగుదల నమోదు చేసి 37,150 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గింది. దీంతో 46,800 రూపాయలకు పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version