అమెజాన్‌ కిడ్స్‌ కార్నివల్‌ ప్రారంభం.. ప్రత్యేక డిస్కౌంట్లు ఇవే!

Join Our Community
follow manalokam on social media

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్‌లతో ముందుకు వచ్చే అమెజాన్‌ ఇప్పుడు కిడ్స్‌ కార్నివాల్‌ నిర్వహిస్తోంది. వరుస ఆఫర్లు, డిస్కౌంట్లతో స్పెషల్‌ కార్నివల్‌ సేల్స్‌ను కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్‌ డెస్క్‌ డిజిటల్‌

మన దేశంలోని ఈ కామర్స్‌ వెబ్‌ సైట్లలో మొదటి స్థానాన్ని సంపాదించుకున్న అమెజాన్, కేవలం పండగలు, ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ కిడ్స్‌ కార్నివాల్‌ ని నిర్వహిస్తోంది.ఈ మధ్యే సమ్మర్‌ అప్లయన్సెస్‌ కార్నివల్‌ సేల్‌ను ప్రారంభించిన అమెజాన్‌, ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా ‘కిడ్స్‌ కార్నివల్‌’ పేరుతో సేల్‌ను ప్రారంభించింది.ఈ సేల్‌ మార్చి 16న ప్రారంభమై,మార్చి 21 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే వస్తువులతో పాటు వారికి అవసరమైన వాటన్నింటినీ ఉంచింది అమెజాన్‌. అందులో పుస్తకాలు, బోర్డు గేమ్స్‌ ఉత్పత్తులు, స్కూల్‌ బ్యాగ్స్, పిల్లలకు ఉపయోగపడే వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇవే కాకుండా, ఆన్‌లైన్‌ క్లాసులకు ఉపయోగపడే ఎకో స్మార్ట్‌ స్పీకర్, ఫైర్‌ టీవీ పరికరాలు, కిండ్లే ఈ–రీడర్స్‌ వంటి పరికరాలపై 30% వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది.

కిడ్స్‌ కార్నివల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే

  • అమెజాన్‌ ఇండియా ఫోర్త్‌ జనరేషన్‌ ఎకో డాట్‌ స్మార్ట్‌ స్పీకర్‌ను కేవలం రూ.3,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
  • అలెక్సా వాయిస్‌ రిమోట్‌ లైట్‌తో పనిచేసే ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ను రూ .2,999 ధరకే లభిస్తోంది.
    కిడ్స్‌ కార్నివాల్‌ సేల్‌లో భాగంగా 10 జనరేషన్‌ కిండ్లే ఈ–రీడర్‌ను కేవలం రూ .7,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
  • అలాగే పిల్లలకు ఎంతో ఇష్టమైన వీడియో గేమ్స్‌ కూడా అమెజాన్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎక్స్‌ బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌ గేమింగ్‌ కన్సోల్‌ పరికరాన్ని రూ .49,990 లకే కొనుగోలు చేయవచ్చు.
  • ఇవికాకుండా పిల్లలకు అవసరమైన స్కూల్‌ సప్లైస్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బాక్సులు వంటి వాటిపై కూడా అమెజాన్‌ డిస్కౌంట్‌ ని అందజేస్తోంది. మీరూ ఈ డీల్స్‌ ని ఓసారి చెక్‌ చేసి మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయండి. డబ్బు అదా చేసుకోండి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...