ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫ్రీ….రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్ ని ఎలా పొందాలంటే…?

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ప్రయోజనంకల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా ఆయుష్మాన్ భారత్ యువజన కార్డుని ఫ్రీగా పొందొచ్చు. ఇది వరకు అయితే రూపాయలు 30 ఛార్జ్ చేసే వాళ్ళు. ఈ కార్డు ఉండడం వల్ల ఫ్రీగా ట్రీట్మెంట్ ని పొందొచ్చు. ఒకవేళ డూప్లికేట్ కార్డు కావాలి అనుకుంటే 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కార్డుని పొందాలి అనుకునే వాళ్ళు సర్వీస్ సెంటర్ లో పొందొచ్చు.

నేషనల్ హెల్త్ అథారిటీ ఈ కార్డు ని ఫ్రీగా అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమంతోంది అంటే..? ఆయుష్మాన్ భారత్ కార్డు ని ఏ ఆస్పత్రిలో నైనా పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా అంటారు. లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటారు లేదా మోడీ కేర్ అని కూడా దీనిని పిలుస్తారు.

కోట్ల మంది కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ రూపాయలు 10 లక్షల ఇన్సూరెన్స్ ని ఇస్తోంది. భారత దేశంలో చాలా మంది ఈ స్కీమ్ లో ఉన్నారు. ఈ స్కీమ్ కింద పదికోట్ల పేదలు మన దేశం నుండి ఈ బెనిఫిట్ ని పొందుతున్నారు. క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఫ్రీగా చికిత్స తీసుకుంటున్నారు. అయిదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ని కూడా ఇది అందిస్తోంది. మీరు కనుక ఈ గోల్డెన్ కార్డు ని కావాలి అనుకుంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రి లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ని ఆశ్రయించండి. రూరల్ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ సెంటర్ లో ఈ కార్డులు అందిస్తున్నారు.

ఈ కార్డు ని మీరు పొందాలనుకుంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకవేళ కొత్త పెళ్లి కోడలు మీ ఇంటికి వస్తే… ఆమెకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఫ్రీ గా ప్రయోజనాలు పొందొచ్చు. తన భర్త ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. మీ పేరు ఇందులో ఉందో లేదో చూసుకోవాలి అంటే https://mera.pmjay.gov.in/search/login ఈ లింక్ మీద క్లిక్ చేసి మొబైల్ నంబర్ టైప్ చేసి ఫోన్ నెంబర్ కి వచ్చే ఓటిపి ని కూడా ఎంటర్ చేయండి. మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్నాక, మీ భర్త పేరు మరియు క్యాస్ట్ కేటగిరి మీ కూడా ఎంచుకోండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. వివరాలను ఎంటర్ చేసి సెర్చ్ చెయ్యండి. దాని వల్ల మీకు కలిగే ఉపయోగాలు కోసం 14555 లేదా 1800 111 55 హెల్ప్ లైన్ నెంబర్ కి డయల్ చేయండి దీనితో మీరు పూర్తి వివరాలు తెలుస్తాయి

Read more RELATED
Recommended to you

Latest news