కేటీఆర్ కి జానారెడ్డి సవాల్ విసిరారు. సుమారు 4 లక్షల 90 వేల ఉద్యోగాలు ఉన్నాయని ఇవన్నీఇచ్చింది ఎవరు… కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించారు. క్యాడర్ స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని అయన అన్నారు. అధికారంలోకి వచ్చి టీఆరెస్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిందని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అన్నదని అన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే పీఆర్సీ కమిషన్ ఇచ్చిన లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఎక్కడినుండి వచ్చింది అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ సంగతి పక్కన పెడితే… నిరుద్యోగ భృతి ఏమైంది..? అని ఆయన ప్రశ్నించారు.
10 ఏండ్లలో ఎన్ని ఇచ్చామన్నది వివరాలు బయటకు ఇస్తామని జానారెడ్డి అన్నారు. నేను 30 ఏండ్ల క్రితం అమ్మిన ఇంటికి నీళ్లు వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారన్న ఆయన వచ్చిన నీళ్లు కూడా భగీరద నీళ్లు కూడా కాదు ఆ ఊర్లో ఎన్ని ఇండ్లకు నీళ్లు రాలేదు అనేది కూడా చూపించానాని అన్నారు. నేను నా నియోజకవర్గంలో ఊర్ల జాబితా ఇస్తా నా వెంట రండి… మీడియా నే వచ్చి విచారణ జరపండి చాలా ఊర్లలో నీళ్లు రావడం లేదు అని ఆయన అన్నారు.