గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్..!

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఆన్లైన్ ట్రాన్సక్షన్ మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రోజువారి తమ అవసరాల కోసం షాపింగ్ చేయాలన్న, బిల్ కట్టాలన్న, డబ్బులను ఎవరికన్నా పంపాలన్న ఎక్కువగా డిజిటల్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి మూడవ పార్టీ UPI పేమెంట్ యాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ UPI పేమెంట్ యాప్‌లను ఉపయోగిస్తున్న వారికి ఒక చేదు వార్త . అదేంటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపిఐ యాప్ ‌ల ద్వారా చేసే అన్ని పేమెంట్లపై 30 శాతం పరిమితిని ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

google-pay-phonepe
google-pay-phonepe

జనవరి 2021 నుంచి గూగుల్ పే, ఫోన్ పే UPI పేమెంట్ యాప్‌ లు వాడే వారికీ ఈ కొత్త నియమం వర్తిస్తుంది. ఈ యాప్‌ లలోని లావాదేవీ వాల్యూమ్‌ లలో 30 శాతానికి పైగా వాటా ఉన్న ఆ సేవలకు గల నిబంధనలను పాటించడానికి రెండేళ్ల వ్యవధి అనుమతించబడుతుంది. వాట్సాప్ తన ప్లాట్ ‌ఫామ్ ‌లో వాట్సాప్ పే ద్వారా లావాదేవీలు కొనసాగించడానికి ప్రస్తుతం ఒక కొత్త చట్టంతో వస్తుంది. బ్యాంక్ యాప్ లతో సహా యుపిఐ పేమెంట్లను ప్రాసెస్ చేసే అన్ని రకాల మూడవ పార్టీ యాప్లకు ఈ చట్టం వర్తిస్తుంది. గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లను ప్రవేశపెట్టినప్పటి నుండి భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఈ యాప్ ల ద్వారానే యుపిఐ చెల్లింపు పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించారు. దీనితో UPI లావాదేవీలు అధికం అయ్యాయి. అందుకనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం UPI చెల్లింపులపై అమలులోకి వచ్చిన కొత్త చట్టం కారణంగా గూగుల్ పే, ఫోన్‌ పే వంటి ప్రసిద్ధ యుపిఐ పేమెంట్ అనువర్తనాలకు కఠినతరం చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సేవలు ఒక్కొక్కటి మొత్తం మార్కెట్ వాటాలో 40 శాతం కలిగి ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే రెండూ చట్టానికి లోబడి ఉండటానికి వారి ప్లాట్‌ ఫామ్‌లో చేసిన లావాదేవీల సంఖ్యను తగ్గించే మార్గాల గురించి ఆలోచిస్తుంది..అయితే పేటీయం, మోబి క్విక్ యాప్ లకు మాత్రం మొత్తం మార్కెట్ వాటాలో 20 శాతం కలిగి ఉన్నాయి. అందుకనే మీ యుపిఐ ఆధారిత లావాదేవీల కోసం మీరు ఎక్కువగా గూగుల్ పే లేదా ఫోన్‌ పే పై ఆధారపడినట్లయితే మీరు తరచుగా లావాదేవీలు చేయడానికి ఇక మీదట కుదరదు. ఇదిలా ఉంటే భీమ్, బ్యాంకు యాప్ లకు ప్రస్తుతం జనాదరణ లేదు. కనీసం మరి ఇప్పుడన్నా వీటి ద్వారా పేమెంట్స్ చేయడానికి మంచి అవకాశం ఉంటుందేమో చూడాలి మరి.