అకౌంట్ లోకి డబ్బులు వేసినా, తీసినా ఇకపై బాదుడే..!

-

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక.. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా సరి కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తన కస్టమర్లకు ఒక ఝలక్ ఇచ్చింది. డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయెల్ చార్జీలను సవరించింది. కొత్త చార్జీలు నవంబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. నిర్ణీత పరిమితి దాటితేనే ఈ చార్జీలు వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. నవంబర్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా చార్జీలను సవరించింది. ఇకమీదట కస్టమర్లు బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చెయ్యాలనుకొంటే ఒక్కో లావాదేవీకి రూ.50 చెల్లించాలి. మూడు ఉచిత పరిమితులు దాటిన తర్వాత నిర్వహించే లావాదేవీలకు ఈ చార్జీలు వర్తిస్తాయి.

మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కస్టమర్లు డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటే రూ.50 కట్టాలి. దీంతో బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయాలన్నా.. లేదంటే తీసుకోవాలన్నా చార్జీలు చెల్లించుకొక తప్పదు. అయితే గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణాల్లోని సీనియర్ సిటిజన్స్, పెన్షనర్లు, ఎస్‌బీఐ అకౌంట్ కలిగిన వారు మూడు ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి దాటిన తర్వాత జరిపే ఒక్కో లావాదేవీకి రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా సీసీ/ఓడీ, కరెంట్ అకౌంట్ ఖాతా కలిగిన వారు రోజులో రూ.లక్షకు పైన డిపాజిట్ చేస్తే తర్వాత డిపాజిట్ మొత్తానికి కనీసం రూ.50 చెల్లించాలి. అదే క్యాష్ విత్‌డ్రాయెల్స్ విషయానికి వస్తే.. అంటే ఏటీఎం విత్‌డ్రాయెల్స్ కాకుండా నెలకు మూడు లావాదేవీలు ఉచితంగా పొందొచ్చు. తర్వాత జరిపే ట్రాన్సాక్షన్లకు రూ.125 చెల్లించుకోవాలి. మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లకు ఇది వర్తిస్తుది. అదే గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.100 చెల్లించాలి.

కరెంట్ అకౌంట్ ఖాతా కలిగిన వారు కూడా లిమిట్ దాటిన తర్వాత రూ.150 చెల్లించుకోవాలి. అయితే జన్ ధన్ అకౌంట్ కలిగిన కస్టమర్లుకి ఈ చార్జీలు వర్తించవు. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఏటీఎం లావాదేవీలపై కొత్త చార్జీలు విధించిన విషయం మనకు తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news