ఈ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..!

బ్యాంక్ కస్టమర్స్ కి ముఖ్యమైన సమాచారం. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా కొన్ని సెలవలు వున్నాయి. కాబట్టి బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇక దీని కోసం చూస్తే..

 

బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రం లో సెలవు ఉంటే మరో రాష్ట్రం లో సెలవు లేక పోవచ్చు. బ్యాంక్ సెలవలు, పని వేళలు తెలుసుకుంటే మీరు దానికి అనుగుణంగా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక సెలవలు ఎప్పుడు అనేది చూస్తే..

జూన్ 6 – ఆదివారం, జూన్ 12 – రెండో శనివారం, జూన్ 13 – ఆదివారం, జూన్ 15 – వైఎంఏ డే/ రాజా సంక్రాంతి ( ఆంద్రప్రదేశ్ లో సెలవు లేదు కేవలం మిజోరం, భువనేశ్వర్‌లో బ్యాంకులు పని చేయవు), జూన్ 20 – ఆదివారం, జూన్ 25 – గురు హర్‌గోవింద్ జయంతి (ఆంద్రప్రదేశ్ లో సెలవు లేదు కేవలం జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు పని చేయవు).

జూన్ 26 – నాలుగో శనివారం, జూన్ 27 – ఆదివారం, జూన్ 30 – రేమ్నా ని ( ఆంద్రప్రదేశ్ లో సెలవు లేదు కేవలం ఇజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు). మన ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఏ ఇతర సెలవులు లేవు. కేవలం ఆదివారాలు, రెండవ శనివారాలు, నాల్గవ శనివారాలు మాత్రమే.