బ్రేకింగ్: సిబిఐ కోర్ట్ లో జగన్ కౌంటర్, సిబిఐ ఏం చెప్పింది…?

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను సిబిఐ కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. పిటిషన్ రాజకీయ దురుద్దేశం తో ఈ పిటిషన్ దాఖలు చేశాడు అని కౌంటర్ లో పేర్కొన్నారు. పిటిషనర్ తన పిటిషన్ లో వాడిన భాష , తీవ్ర అభ్యంతరకరంగా ఉంది అని, పిటిషనర్ 900 కోట్లు బ్యాంక్ లను మోసం చేసిన కేసులు నిందితుడు గా ఉన్నాడు అని వెల్లడించారు.

దీంతో ఇతనిపై సిబిఐ కేసులు నమోదు చేసింది,ఆ కేసుల విచారణ కోర్ట్ లో కొనసాగుతుంది అని వివరించారు. పిటిషనర్ వైసీపీ పార్టీ సభ్యుడిగా ఉండి, వ్యతిరేక కార్యాలపాలకు పాల్పడ్డాడు అని పేర్కొన్నారు. దీంతో అతని అనర్హుడు గా ప్రకటించాలని స్పీకర్ కు లెటర్ రాశాము అని వివరించారు. వ్యక్తికి , ఇన్వెస్ట్ గేషన్ ఏజెన్సీ మధ్య జరుగుతున్న విచారణలో మూడో వ్యక్తి కి సబంధం లేదు అని స్పష్టం చేసారు. ఇక కోర్ట్ పిటీషన్ లో అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సిబిఐ కౌంటర్ లో పేర్కొంది.