ఏసీ, ఫ్రిజ్‌ కొనడానికి డబ్బులు లేవా? అయితే ఇది మీకోసమే!

-

వేసవితో ఇబ్బంది పడుతూ దాన్ని నుంచి ఉపశమనం పొందే ఏసీ, ఫ్రిజ్‌లను కొనలేని పరిస్థితిలో ఉన్నారా? అయితే ఇది మీకు ఊరట కలిగించే విషయమే. కొన్ని లోన్‌ ఆప్షన్లు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. అవేంటో చూద్దాం.

ఎండలు మండుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేసవిలో కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. వీటికి పెద్ద డిస్కౌంట్లు కూడా ఏమీ ప్రకటించట్లేదు సంస్థలు. అయినప్పటికీ స్మార్ట్‌ లోన్‌ ఆప్షన్ల ద్వారా వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

అందుబాటులో ఉన్న కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్‌ లోన్స్‌

  • కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్‌ కొనుగోలుకు చేసేందుకు వివిధ బ్యాంకులు పర్సనల్‌ లోన్లు మంజూరు చేస్తాయి. అత్యవసరంగా డబ్బు కావాలంటే పర్సనల్‌ లోన్‌ మంచి ఎంపిక. ఎంత రుణం ఇవ్వాలి? ఎంత వడ్డీరేట్లను నిర్ణయించాలి? అనే విషయాలు మీ క్రెడిట్‌ స్కోరు, నెలవారీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై 9%– 16% వడ్డీ రేట్లు వసూలు చేస్తుంటాయి. మీ నెలవారీ జీతాన్ని బట్టి 1– 5 ఏళ్ల మధ్య లోన్‌ గడువుతో రూ .30 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను సులభంగా పొందవచ్చు.
  •  ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు, రిటైలర్లు క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోలుదారులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు, నోకాస్ట్‌ ఈఎంఐ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. దీని కోసం క్రెడిట్‌ కార్డు జారీచేసే సంస్థలు వివిధ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు లేదా తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో ఆఫర్లను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.
  • ఈ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని కన్సూ్యమర్‌ డ్యూరబుల్‌ లోన్‌ అందజేస్తున్నాయి. ఆఫ్‌లైన్‌ స్టోర్ల నుండి కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్‌ కొనుగోలు చేసేవారికి నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఎటువంటి వడ్డీ లేకుండానే.. వస్తువు మొత్తం ధరను 6, 9, 12 సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డు లేని కస్టమర్లకు ఈ కన్సూ్యమర్‌ డ్యూరబుల్‌ లోన్‌ అనుకూలంగా ఉంటుంది.
  •  సకాలంలో క్రెడిట్‌ కార్డు బిల్‌ చెల్లింపు చేసే కస్టమర్లకు కొన్ని క్రెడిట్‌ కార్డు సంస్థలు ప్రీ అప్రూవుడ్‌ లోన్ అందిస్తున్నాయి వీటికి ప్రాసెసింగ్‌ టైం కూడా చాలా తక్కువ. దరఖాస్తు చేసిన కొద్ది గంటల్లోనే మీ మొత్తం రుణం బదిలీ చేయబడుతుంది. అయితే, తీసుకున్న రుణాన్ని ఆరు నెలల నుంచి ఐదు ఏళ్ల మధ్య చెల్లించవచ్చు. వడ్డీరేట్లు 15% నుంచి ప్రారంభమవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version