ఈ కార్డు తీసుకున్నారా..? లేకపోతే ఐదు లక్షలు నష్టపోతారు..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ కూడా ఒకటి. దీని వలన చాల రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ తో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఈ స్కీమ్ ని మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

Narendra_Modi
Narendra_Modi

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య లక్ష్యం. అందుకే దీనిని తీసుకు వచ్చారు. జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఒక్కో కుటుంబం రూ.5 లక్షల వరకు లాభం పొందొచ్చు. పెద్ద హాస్పిటల్స్‌లో ఏడాదికి రూ.5 లక్షల వరకు చికిత్స చేయించుకోవచ్చు.

అయితే ఈ సేవలని పొందడానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సి పని లేదు గుర్తుంచుకోండి. ఈ స్కీమ్ వలన కలిగే బెనిఫిట్స్ ని ఉచితం గానే పొందొచ్చు. కాబట్టి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పేదలు ఈ కార్డు వస్తుంది.

మీ దగ్గరిలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి సీఎంవోను కలిస్తే చాలు ఈ స్కీమ్ లో చేరి పోవచ్చు.
ఆరోగ్య మిత్ర ద్వారా కూడా మీరు ఆయుష్మాత్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. తద్వారా ఎన్నో బెనిఫిట్స్ ని మీరు పొందొచ్చు.