ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసేవాళ్ళు ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి..!

-

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కి చాల మంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయడం వలన ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది.  ఫిక్సెడ్ చేయడం వలన పిల్లల ఉన్నత విద్యకి కానీ వివాహానికి కానీ వినియోగించుకోవచ్చు.

డబ్బులు
డబ్బులు

ఇలా ఆర్ధిక ఇబ్బంది లేకుండా సమయానికి డబ్బులు ఉంటాయి. స్వల్పకాలం నుంచి దీర్ఘకాలికంగా కూడా ఫిక్సెడ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తంపై ఎలాంటి ప్రమాదం ఉండదు. దీంతో పాటు, మీరు నిర్ణీత వ్యవధిలో రాబడిని కూడా పొందవచ్చు. అలానే ఇది ఎంతో సురక్షితం కూడా. అత్యవసర సమయాల్లో మీ ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాన్ని తీసుకునే అవకాశం కూడా వుంది. గరిష్టంగా 90 శాతం వరకు రుణం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.

ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాన్ని తీసుకునే అవకాశం తో పాటు నెలవారీ వడ్డీ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
FD లో లభించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వస్తుంది.
మార్కెట్ ప్రభావం లేనందున ఈ డబ్బులు ఎప్పుడు సురక్షితంగా ఉంటాయి.
ఏదైనా FD లో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
అలానే ఎన్ని ఏళ్ళకి ఫిక్సెడ్ డిపాజిట్ చేసినా… అవసరం అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news