కరోనా వైరస్ నేపథ్యంలో అదిరే లాభాలు.. రూ.లక్ష పెట్టి సంవత్సరానికి రూ.3 లక్షలు..!

కరోనా వలన ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అలాంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్‌పై గత ఏడాది నుంచి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఈ కంపెనీ స్టాక్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

డబ్బులు

ఈ కంపెనీ భారీ రాబడిని అందించింది. ఇక ఈ కంపెనీ గురించి చూస్తే.. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది గ్లోబల్ వీసా ఔట్‌సోర్స్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ప్రభుత్వాలతో, ఎంబసీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ ఉంటుంది.

32 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కంపెనీ షేరు అదిరిపోయే లాభాన్ని ఇచ్చేసింది. ఏడాది కిందట ఈ షేరు ధర రూ.43గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్టాక్ ధర రూ.139 వద్ద వుంది.

ఈ షేరు ఇన్వెస్టర్ల డబ్బును మూడు రెట్లు చేసింది. మహమ్మారి సమయం లో లాక్ డౌన్ ఉన్నా కూడా ఈ షేరు ధర గత ఏడాది కాలంలో 220 శాతం పరుగులు పెట్టింది. ఇది స్మాల్ క్యాప్ స్టాక్. ఏడాది కిందట ఎవరైనా ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీ డబ్బు విలువ రూ.3 లక్షలకు పైనే అయ్యి ఉండేది.