ఇంట్లోకి సరుకులు కొనుక్కుంటున్నారా…? కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

-

గతంలో ఇంట్లోకి వంట సరుకులు కొనుక్కోవాలంటే ఎలా ఉండే వారు…? వంద రూపాయలు తీసుకెళ్ళి, అది పావు కేజీ ఇది పావు కేజీ, అలా అది కొంచెం ఇది కొంచెం కొనుగోలు చేసుకుని వచ్చే వారు. కాని బిజీ అయిపోయారు గా ఇప్పుడు అందుకే నెల రోజులకు సరిపడా ఇప్పుడే కొనుగోలు చేసుకుని పెట్టుకుంటున్నారు. రోజు తెచ్చుకోలేమని, నెల రోజులకు సరిపడా పప్పులు, ఉప్పులు అంటూ మొత్తం తెస్తున్నారు.

కాని అది మంచి పద్ధతి కాదంటే కాదు. గతంలో సరుకుల్లో కలుషితం అనేది ఉండేది కాదు. జనాభా తక్కువ ఉండటం, ఉత్పత్తులు ఎక్కువగా ఉండటంతో కల్తీ చేసే అవసరం అనేది రాలేదు. కాని ఇప్పుడు జనం పెరిగిపోవడంతో కల్తీ అనేది క్రమంగా పెరిగిపోవడం మొదలయింది. కాబట్టి కంది పప్పులో రకాలు పెరిగాయి, బియ్యంలో ధరలు మారాయు, నూనెలో కొత్త రకాలు, కొత్త పేర్లు మనం వింటున్నాం చూస్తున్నాం, తింటున్నాం. అవి నిల్వ కూడా ఉండటం లేదు.

తెచ్చిన పది రోజులకు పురుగులు పట్టడం, పాడైపోవడం వంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటి సరుకులు అప్పుడే తెచ్చుకోండి. రెండు మూడు రోజులకు ఒకసారి తెచ్చుకోండి. సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. వీలైనంత వరకు సరుకులు కిరాణా షాపుల్లోనే కొనుగోలు చేసుకోండి. సూపర్ మార్కెట్ లో కల్తీ సరుకు ఎక్కువ అనే విషయం చాలా విధాలుగా రుజువు అయింది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. హడావుడి జీవితంలో తినే దగ్గర కూడా హడావుడి చేస్తే హడావుడి గా హాస్పిటల్ కి పరిగెత్తాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version