రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చూడండి…!

రైతులకి రైతు భరోసా డబ్బులు ఏపీ ప్రభుత్వం అందిస్తోంది అన్న సంగతి తెలిసిందే. దీని వలన రైతులకి ప్రయోజనం కలగనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా స్కీమ్ కింద రూ.5,500 జమ చేసింది. అయితే ఈ డబ్బులు మీ ఖాతా లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.

 

కొంత మంది రైతులకు ఇప్పటికే డబ్బులు వచ్చాయి. అలాగే మరి కొంత మందికి అయితే బ్యాంక్ అకౌంట్ల లోకి రైతు భరోసా డబ్బులు రాలేదు. మీ ఖాతా లోకి డబ్బులు వచ్చాయా లేదా అనేది ఇలా చూసుకోవచ్చు. దీని కోసం మీరో రైతు భరోసా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి. అప్పుడే మీ బ్యాంక్ ఖాతా లో డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుస్తోంది.

ముందు రైతు భరోసా వెబ్‌సైట్‌కు వెళ్లి.. నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చెయ్యండి. ఆ తరువాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్ట్ క్యాప్చా ఎంటర్ చేసి…. సబ్‌మిట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మీకు పేమెంట్ స్టేటస్ వివరాలు తెలిసిపోతాయి.