హరీష్ రావుకే ఆరోగ్య శాఖ?

ఆరోగ్య మంత్రిగా ఈటల రాజేందర్ గారిని తప్పించగానే ఆ శాఖని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ శాఖ గురించిన చర్చ బాగా జరుగుతుంది. ఆరోగ్య శాఖ ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి వద్ద ఉండదని, ఎవరో ఒకరికి అప్పగిస్తారని అంటున్నారు. తాజాగా ఒకానొక పేరు బయటకి వచ్చింది. ఆ పేరే హరీష్ రావు. ప్రస్తుతం ఆర్థిక శాఖ చూసుకుంటున్న హరీష్ రావు గారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం ఉందని వినబడుతుంది.

ఐతే ఈ పుకారు రావడానికి కారణం కూడా ఉంది. ప్రస్తుతం చెలరేగుతున్న సెకండ్ వేవ్ విషయమై, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినపుడు దానికి కేసీఆర్ హాజరు అవకుండా హరీష్ రావు హాజరు కావడమే కారణం. మరి ఈ పుకార్లు నిజమవుతాయా లేదా చూడాలి. మరో పక్క ఇప్పట్లో కేబినేట్ విస్తరణ ఉండదని చెప్పుకుంటున్నారు.