కేంద్రం: మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్..!

సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే మధ్య తరగతి ప్రజలకు తీపికబురు అందించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

modi/ మధ్య తరగతి ప్రజలకు

తాజాగా కేంద్ర ప్రభుత్వం 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన 708 ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా జరిగిన మీటింగ్ లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో సొంతింటి కల నెరవేర్చుకోవాలని వాళ్లకి మంచి ప్రయోజనం ఉంటుంది.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మొత్తంగా 112.4 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ఢిల్లీలో జరిగిన 54వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం లో ఈ మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో సొంతింటి కల సాకారం చేసుకో వచ్చు.