కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజులలో జాతీయ రహదారులపై ప్రయాణించడం ఈజీ కానుంది. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణీత పరిమితి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే టోల్ ఫీజులను వసూలు చేసేలా నిర్ణయం తీసుకోనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రానున్న రోజులలో జాతీయ రహదారుల పై ప్రయాణించడం సులభం చేసింది.
పదే పదే హైవేల పై ప్రయాణించే స్థానిక ప్రజలకు రిలీఫ్ ని తీసుకొచ్చింది. అయితే వీళ్ళు టోల్ ఫీజులను చెల్లించాల్సినవసరం లేదని కేంద్రం చెప్పింది. పైగా వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పాస్ ని కూడా తీసుకు రానుంది. వచ్చే మూడు నెలలో ఇది అమలు లోకి తీసుకు వస్తున్నట్టు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ లోక్‌సభకు వెల్లడించారు.
అలానే వచ్చే మూడు నెలలో దేశంలో టోల్ ప్లాజాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించబోతుందని ఆయన అన్నారు. 60 కి.మీల పరిధిలో కేవలం ఒక్క టోల్ ప్లాజానే చేస్తుందన్నారు. 60 కి.మీల వెలుపలు ఉన్న ఇతర టోల్ ప్లాజాలను వచ్చే మూడు నెలల్లో క్లోజ్ చేసేస్తామని చెప్పారు.
ఎప్పుడు టోల్ ప్లాజాల నుండి ప్రయాణించే స్థానిక ప్రజలు ఈ ఫీజులను చెల్లించాల్సినవసరం లేదని చెప్పారు. వచ్చే మూడేళ్లలో జాతీయ రహదారుల టోల్ ఆదాయం వార్షికంగా రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని గడ్కారీ అన్నారు.