కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..!

మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ని పెంచడం జరిగింది. 2020 జనవరి నుంచి పెండింగ్‌ లో ఉన్న మూడు డీఏలను ఒకేసారి పెంచారు. దీనితో ఏకంగా 11 శాతం డీఏ పెరిగింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ మాత్రమే వచ్చేది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం ఏకంగా మూడు డీఏలను పెంచుతూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.

 

Central-Govt-Employees
Central-Govt-Employees

ఒకేసారి పెరగడంతో 17 శాతంగా ఉన్న డీఏ ఏకంగా 28 శాతానికి పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరిగింది. ఆ మూడు డీఏల బకాయిలుని ఇంకా విడుదల చెయ్యలేదు. ఇది ఇలా ఉంటే పండుగ సీజన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డీఏ విషయం లో మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

2021 జూలై డీఏ మూడు శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2021 జనవరి డీఏను ఇప్పటికే పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2021 జూలై డీఏ ప్రకటించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏను పెంచితే ఉద్యోగులకు మొత్తం 31 శాతం డీఏ లభిస్తుంది. ఒకవేళ కనుక ఈ నెల లో డీఏ పెంపు ప్రకటిస్తే అక్టోబర్‌ లో ఉద్యోగులకు వేతనం, పెన్షనర్లకు పెన్షన్ పెరుగుతుంది.