ఆధార్ లో అడ్రెస్ ని ఇలా సులువుగా మార్చుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు లేకపోతే చాలా ప్రయోజనాలని పొందలేము. ప్రభుత్వ స్కీమ్స్ ని పొందడానికి మొదలు చాలా వాటికి ఆధార్ అవసరం. ఒకవేళ కనుక ఆధార్ కార్డు లో వివరాలు ఉంటే ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఈజీగా ఆ తప్పులని సరి చేసుకోచ్చు. అయితే కొన్నింటికి డాక్యుమెంట్ ప్రూఫ్స్ కావాల్సి ఉంటుంది.

ఇక ఈరోజు ఆధార్ లో అడ్రెస్ ని ఎలా మార్చాలి అనేది చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం. డాక్యుమెంట్ల అవసరం లేకుండా మొబైల్ నెంబర్, బయోమెట్రిక్స్ అప్‌డేట్ వంటివి అయ్యిపోతాయి. కానీ ఆధార్ లో అడ్రస్ వంటి వివరాలు మార్చుకోవాలంటే తప్పక ప్రూఫ్ కావాలి. అయితే యూఐడీఏఐ ప్రకారం 45 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకదాన్ని అడ్రస్ ప్రూఫ్‌ అప్‌డేట్ కోసం ఉపయోగించొచ్చు.

అవి ఏమిటంటే.. పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్, పోస్టాఫీస్ అకౌంట్ లేదా స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్, గ్యాస్ కనెక్షన్ బిల్లు మొదలైనవి. అయితే వీటిలో మీరు ఎదో ఒక దానిని తీసుకుని ప్రూఫ్ గా పెట్టడానికి అవుతుంది. ఇది ఇలా ఉంటే అడ్రెస్ మార్చడానికి ఇలా చెయ్యండి.

ముందుగా డాక్యుమెంట్లు కలిగిన వారు https://ssup.uidai.gov.in/ssup/ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.
ప్రోసీడ్ టు అప్‌డేట్ ఆధార్ ని సెలెక్ట్ చేసుకోండి.
యూఐడీఏఐ అడిగిన వివరాలని ఎంటర్ చెయ్యండి.
ఓటీపీ కోసం క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు అప్‌డేట్ అడ్రస్ ఆప్షన్ ఎంచుకోవాలి.

మీరు అవసరమైన మార్పులు చేసి డాక్యుమెంట్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి. డబ్బులు చెల్లించాలి. మీ అడ్రస్ అప్‌డేట్ అవుతుంది. కొత్త కార్డు మీరు పోస్ట్ ద్వారా పొందొచ్చు అంతే.

Read more RELATED
Recommended to you

Latest news