హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ కలకలం..!

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో 7 సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్మెంట్ లో ఆడుకుంటున్న అనీష్ కిడ్నాప్ కు గురయ్యాడు. మద్యాహ్నం ఒంటి గంట నుండి బాలుడు కనిపించ కుండా పోయాడు. సాయంత్రం బాలుడు కనిపించడం‌ లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. దాంతో హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన‌‌ కాప్స్ పది బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం గాలిస్తున్నారు.

బాలుడిని ఓ లేడీ కిడ్నాప్ చేసారా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలుడు కిడ్నాప్ అయ్యిన అపార్ట్మెంట్ లో సీసీ టివి ఫుటేజ్ కోరగా గత పది రోజులుగా సీసీ టివి పనిచేయడం లేదని తెలుస్తోంది. దాంతో అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తల్లి తండ్రులు ఆచూకీ కోసం కన్నీరు మున్నీరు అవుతున్నారు. బలుడికోసం తల్లి పడుతున్న ఆవేదన అందర్నీ కలచివేస్తుంది.