మీ LIC పాలసీ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఇలా చెక్ చేసుకోండి…!

మీ LIC పాలసీ డబ్బులు ఎప్పుడు వస్తాయనేది ఇలా తెలుసుకోండి. పైగా ఇంట్లో వుండే చూసుకోవచ్చు ఎక్కడకి వెళ్లాల్సిన పని కూడా లేదు.

దీని కోసం మీరు ముందుగా మీరు https://licindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యాలి.
నెక్స్ట్ హోమ్ పేజీ లో Customer Portal క్లిక్ చేయండి.
ఇప్పుడు New User పైన క్లిక్ చేయండి.
ఆ తరువాత పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తో రిజిస్టర్ చేయండి.
కేవైసీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

ఇలా మీరు రిజిస్ట్రేషన్ అయ్యాక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకసారి లాగిన్ అయితే https://ebiz.licindia.in/ వెబ్‌సైట్‌లో Customer Portal పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. దీనిలో మీరు అనేక వివరాలని తెలుసుకోవచ్చు.

లేదా మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ సేవల్ని పొందొచ్చు. ఇందుకోసం ఎల్ఐసీ 56767877, 9222492224 నెంబర్లను ఆపరేట్ చేస్తుంది. కనుక మీరు ఇలా కూడా సమాచారాన్ని పొందొచ్చు.