క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునేవాళ్ళు తప్పక వీటిని గుర్తుంచుకోండి..!

-

కొత్త క్రెడిట్ కార్డు ( Credit Card ) తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక ఈ విషయాలని గమనించాలి. దీని వలన ఇబ్బందులు వుండవు. కేవలం లాభాలు మాత్రమే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

credit card | క్రెడిట్ కార్డు
credit card | క్రెడిట్ కార్డు

బ్యాంకులు కస్టమర్లకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఒక బ్యాంక్ ఎన్నో రకాల కార్డులు జారీ చేస్తుంది. అయితే అన్ని కార్డులకు మీకు అర్హత ఉండకపోవచ్చు. కనుక మీ అర్హత ప్రాతిపదికన క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకోవాలి.

ఒకవేళ కనుక మీరు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటే అప్పుడు మీరు ఆన్‌లైన్ షాపింగ్ కార్డును ఎంచుకోవాలి. లేదు ఫ్యూయెల్ ఎక్కువగా వినియోగిస్తుంటే అప్పుడు ఫ్యూయెల్ కార్డు ఎంపిక చేసుకోవాలి.

అధిక క్యాష్‌బ్యాక్ వచ్చే కార్డును ఎంచుకోవడం ఉత్తమం. మీరు నెలకు రూ.20 వేలు ఖర్చు చేస్తూ ఉంటే అప్పుడు మీరు రూ.20 వేలపైన 10 శాతం క్యాష్‌బ్యాక్ అందించే కార్డును తీసుకుంటే మంచిది. ఇది ఇలా ఉంటే మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన మీ కార్డు లిమిట్ కూడా మారుతుంది. ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డును తీసుకోవడం ఉత్తమం.

అలానే క్రెడిట్ కార్డుపై వార్షిక చార్జీలు ఉంటాయి. కనుక ముందు చార్జీల గురించి కూడా తెలుసుకోండి. కార్డు తీసుకునే ముందు రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్, ఈఎంఐ ఫెసిలిటీ వంటి వాటి కోసం కూడా తెలుసుకోవడం మంచిది. ఇలా ఈ విషయాలని తెలుసుకుని క్రెడిట్ కార్డు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news